శామ్‌సంగ్ ఎ సిరీస్ నుండి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. అతితక్కువ ధరకే అందుబాటులోకి..

First Published | Jan 27, 2021, 5:49 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్ తాజాగా ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ02 ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ02 ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, దీనిలో 6.5-అంగుళాల ఇన్ఫినిటీ-వి డిస్ ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం ...
 

శామ్సంగ్ గెలాక్సీ ఎ02 ధరథాయ్‌లాండ్‌లో ఈ ఫోన్ ధర టి‌హెచ్‌బి 2,999 అంటే ఇండియాలో 7,300 రూపాయలు. ఈ ఫోన్ 32 జిబి 64 జిబి స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది కాని కంపెనీ కేవలం ఒక వేరియంట్ 2 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర గురించి మాత్రామే సమాచారాన్ని తెలిపింది. ఈ ఫోన్ డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ, డెనిమ్ గ్రే, డెనిమ్ రెడ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ గురించి ప్రస్తుతం సమాచారం లేదు.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ02 స్పెసిఫికేషన్లుఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌కు 1.5GHz మీడియాటెక్ MT6739W క్వాడ్‌కోర్ ప్రాసెసర్ లభిస్తుంది. ఈ ఫోన్ 2జి‌బి+ 32జి‌బి, 3జి‌బి + 32జి‌బి, 3జి‌బి + 64జి‌బి స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది, అయితే స్టోరేజీని మెమరీ కార్డ్ సహాయంతో 1టి‌బి వరకు పెంచవచ్చు.
undefined

Latest Videos


శామ్సంగ్ గెలాక్సీ ఎ02ఈ శామ్సంగ్ ఫోన్ కెమెరా గురించి చెప్పాలంటే దీనికి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో మ్యాచింగ్ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ దాని ఎపర్చరు f1.9. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ తో ఎపర్చరు f2.4. 8xజూమ్ కూడా కెమెరాలో లభిస్తుంది. ఈ శామ్‌సంగ్ ఫోన్‌లో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
undefined
శామ్సంగ్ గెలాక్సీ ఎ02 బ్యాటరీశామ్సంగ్ గెలాక్సీ ఎ02లో 5000mAh బ్యాటరీ ఉంది, ఇది 7.75W ఫాస్ట్ ఛార్జింగ్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 4జి ఎల్‌టిఇ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, వై-ఫై బిజిఎన్, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ + గ్లోనాస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ బరువు 206 గ్రాములు.
undefined
click me!