Sony Headphones: 75 గంటల బ్యాటరీ బ్యాకప్ తో సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. అదిరిపోయే ఫీచర్లు!

Published : Nov 20, 2026, 05:51 PM IST

Sony Headphones: హెడ్‌ఫోన్స్ ఎక్కువగా వాడేవారికి బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. అలాంటి వారికోసం సోనీ అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ తీసుకొచ్చింది. లాంగ్ బ్యాటరీ లైఫ్, సూపర్ ఆడియో క్వాలిటీతో వచ్చే ఈ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ గురించి తెలుసుకుందాం

PREV
14
సోనీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్

సోనీ (Sony) కంపెనీ తన కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ 'WH-CH730N', 'WH-CH530' మోడళ్లను ఇండియాలో లాంచ్ చేసింది. పలు కలర్ ఆప్షన్స్‌లో వచ్చిన ఈ హెడ్‌ఫోన్స్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఏఐ (AI) బేస్డ్ కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్లు ఉన్నాయి.

సోనీ WH-CH730N మోడల్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. ANC ఆఫ్ చేసి ఉంచితే 75 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే, WH-CH530 మోడల్ 55 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఈ రెండు హెడ్‌ఫోన్స్‌లోనూ సోనీ డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ (DSEE) టెక్నాలజీని అందించారు.

24
ధర, సేల్స్ వివరాలు

సోనీ WH-CH730N - ఇండియాలో దీని ధర రూ.12,990 గా నిర్ణయించారు. ఓవర్-ఇయర్ (Over-ear) డిజైన్‌తో వచ్చిన ఈ హెడ్‌ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్, పింక్, బీజ్ కలర్స్‌లో లభిస్తుంది.

సోనీ WH-CH530 - దీని ధర రూ.4,490. ఇది బ్లాక్, వైట్, కోబాల్ట్, కోరల్, పింక్, మింట్ కలర్స్‌లో సేల్‌కు వచ్చింది. ఈ రెండు హెడ్‌ఫోన్స్ సేల్ ఇప్పటికే మొదలైంది.

34
కామన్ ఫీచర్స్

సోనీ WH-CH730N, WH-CH530 రెండు మోడళ్లూ ఏఐ-పవర్డ్ కాల్ నాయిస్ రిడక్షన్, ఆరాకాస్ట్, ఒకేసారి రెండు బ్లూటూత్ డివైజ్‌లను కనెక్ట్ చేసుకునే మల్టీపాయింట్ కనెక్షన్ ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి. 30mm డ్రైవర్స్, సోనీ DSEE టెక్నాలజీతో వచ్చిన ఇవి, SBC, AAC, LC3 ఆడియో కోడెక్స్‌తో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. అలాగే, సోనీ సౌండ్ కనెక్ట్ యాప్ ద్వారా 10-బ్యాండ్ ఈక్వలైజర్, 360 రియాలిటీ ఆడియో ఫీచర్‌ను పొందవచ్చు.

44
స్పెషల్ ఫీచర్స్

సోనీ WH-CH730N స్పెషల్ ఫీచర్స్

ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ అయిన దీంట్లో, కాల్స్ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల నాయిస్‌ను ఆపేందుకు డ్యూయల్ నాయిస్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. 20 లెవల్స్‌లో మార్చుకోగల ఆంబియంట్ సౌండ్ మోడ్స్, ప్రిసైజ్ వాయిస్ పికప్ టెక్నాలజీతో కూడిన ఏఐ బీమ్‌ఫార్మింగ్ మైక్రోఫోన్స్ ఇందులో ఉన్నాయి. బ్లూటూత్ LE ఆడియో, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆఫ్ చేస్తే 75 గంటలు, ANC ఆన్ చేస్తే 50 గంటలు దీని బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీని బరువు సుమారు 207 గ్రాములు ఉంటుంది.

సోనీ WH-CH530 స్పెషల్ ఫీచర్స్

30mm డ్రైవర్ యూనిట్స్‌తో క్లోజ్డ్, ఆన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉన్న ఈ మోడల్‌లో, కాల్స్ కోసం ఏఐ బేస్డ్ నాయిస్ రిడక్షన్ ఫీచర్ ఉంది. కానీ, ఇందులో ఆంబియంట్ సౌండ్ మోడ్ ఫీచర్ లేదు. సింగిల్ ఛార్జ్‌పై 55 గంటల వరకు మ్యూజిక్ వినొచ్చు, 35 గంటల వరకు మాట్లాడొచ్చు అని కంపెనీ చెబుతోంది. దీని బరువు సుమారు 150 గ్రాములవరకు ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories