Quad Camera: స్మార్ట్ ఫోన్ లో ఉన్న నాలుగైదు కెమెరాల్లో ఏ కెమెరా ఫోటో తీస్తుంది?

Published : Jul 04, 2026, 05:38 PM IST

Quad Camera: స్మార్ట్ ఫోన్ కు వెనకాల ఉండే కెమెరాల్లో ఏది ఫోటో తీస్తుంది. మూడు, నాలుగు ఉన్నంత మాత్రాన అవన్నీ ఓకేసారి ఫోటో తీయగలవా? అసలు ఏ కెమెరా పనిచేస్తుందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

PREV
15
నాలుగు కెమెరాలు ఉన్న మొబైల్

స్మార్ట్ ఫోన్ కు వెనకాల ఉండే కెమెరాల్లో ఏది ఫోటో తీస్తుంది. మూడు, నాలుగు ఉన్నంత మాత్రాన అవన్నీ ఓకేసారి ఫోటో తీయగలవా? అసలు ఏ కెమెరా పనిచేస్తుందో తెలుసా. చాలా స్మార్ట్‌ఫోన్‌ల వెనుక మూడు లేదా నాలుగు కెమెరాలు ఉంటాయి. జనం వీటితోనే ఫొటోలు తీసుకుంటారు. కానీ ఫొటో తీసేటప్పుడు ఏ కెమెరా పనిచేస్తుందో చాలామందికి తెలియదు. 

25
ప్రైమరీ కెమెరా
సాధారణంగా ఫోన్ వెనుక ఉండే కెమెరాను 'ప్రైమరీ కెమెరా' అని, ముందు వైపు ఉండేదాన్ని 'సెల్ఫీ కెమెరా' అని అంటారు. గ్రూప్ ఫొటోలతో సహా చాలా సందర్భాల్లో ప్రైమరీ కెమెరానే వాడుతాం. ఫొటో తీసేటప్పుడు అల్ట్రా-వైడ్, జూమ్ వంటి ఫీచర్లు వాడుతుంటాం. మరి వెనుక ఉన్న మూడు, నాలుగు కెమెరాలు ఒకేసారి పనిచేస్తాయా? లేదా? తెలుసుకుందాం.
35
ట్రిపుల్ లేదా క్వాడ్ కెమెరా
సాధారణంగా ఫొటో తీసేటప్పుడు ప్రైమరీ కెమెరా పనిచేస్తుంది. మీరు అల్ట్రా-వైడ్ మోడ్ సెలెక్ట్ చేస్తే, ఆటోమేటిక్‌గా అల్ట్రా-వైడ్ కెమెరా ఆన్ అవుతుంది. అలాగే జూమ్ చేసినప్పుడు టెలిఫోటో కెమెరా యాక్టివేట్ అవుతుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు హై-క్వాలిటీ ఫొటోల కోసం కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు ఇస్తాయి. కానీ, ఒకే ఫొటో కోసం అన్ని కెమెరాలు వాడలేం.
45
నాలుగు కెమెరాల వల్ల ప్రయోజనం ఏమిటి?
ఒక మొబైల్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ కెమెరాలు ఉన్నంత మాత్రాన ఫొటో క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని అనుకోలేం. అసలు ప్రయోజనం ఏంటంటే, ఒకే ఫోన్‌తో వేర్వేరు పరిస్థితుల్లో మంచి ఫొటోలు తీయొచ్చు.
55
AI, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ

దూరంగా ఉన్న దాన్ని దగ్గరగా జూమ్ చేసి తీయడానికి ఒక కెమెరా సాయపడుతుంది. అలాగే, లాంగ్ షాట్ వ్యూ క్లిక్ చేసేటప్పుడు మరో కెమెరా ఆన్ అవుతుంది. ఒకే ఫోన్‌తో అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీసుకోవచ్చు. దీనికి తోడు, చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు AI, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వాడుతున్నాయి. ఈ టెక్నాలజీతో ఫొటోల క్వాలిటీ మరింత మెరుగవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories