ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. సాధారణంగా మన ఫోన్ పాతదైనప్పుడు లేదా మనకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ అవసరమైనప్పుడు పాత ఫోన్ పక్కన పెట్టేస్తుంటాం. కానీ పాత స్మార్ట్ ఫోని ఇంట్లో చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు.. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఎక్కడో ఒక మూలన పడేస్తుంటాం. అది మంచి కండీషన్ లో ఉన్నా సరే.. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేక పోతుంటాం. అయితే పాత మొబైల్‌ను సరిగ్గా వాడితే అది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటి భద్రత, పిల్లల వినోదం, చదువు, మీడియా ప్లేయర్‌గా కూడా వాడుకోవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
24
సీసీ కెమెరాగా..
కొన్ని మొబైల్ యాప్స్ ని ఉపయోగించి పాత మొబైల్‌ను ఇల్లు లేదా ఆఫీసు కోసం సీసీ కెమెరాగా మార్చేయవచ్చు. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి 24x7 పర్యవేక్షించవచ్చు. కొత్త కెమెరా కొనకుండానే మన పాత ఫోన్ తోనే భద్రతను పెంచుకోవచ్చు.
34
పిల్లల కోసం..
ప్రస్తుతం చాలామంది పిల్లలు ఆన్ లైన్ క్లాసులు వినడానికి, ఇతర అవసరాలకు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. పిల్లల కోసం కూడా కొత్త మొబైల్ కొనే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మీ పాత స్మార్ట్ ఫోన్ ని వై-ఫై కి కనెక్ట్ చేసి.. పిల్లలకు అవసరమైన ఎడ్యుకేషనల్ యాప్స్, ఛానెల్స్ చూడవచ్చు. లేదా గేమింగ్ డివైజ్‌గా మార్చవచ్చు. దానివల్ల పిల్లలకు కొత్త మొబైల్ కొనివ్వాల్సిన పని ఉండదు.
పాత ఫోన్‌ను స్మార్ట్ హోమ్ కంట్రోలర్‌గా కూడా వాడవచ్చు. మీడియా డివైజ్‌గా ఉపయోగించవచ్చు. ప్రయాణంలో వై-ఫై హాట్‌స్పాట్‌గా లేదా సెకండరీ డివైజ్‌గా కూడా పాత ఫోన్ ఉపయోగపడుతుంది. ఇలా పాత ఫోన్‌ను వాడి డబ్బు ఆదా చేసుకోవచ్చు.