మెగాస్టార్‌ని కూడా వ‌ద‌ల్లేదు.. అస‌లేంటీ డీప్‌ఫేక్‌, ఎలా చేస్తారు, గుర్తించేదెలా? బిగ్‌స్టోరీలో పూర్తి వివ‌రాలు

Published : Nov 01, 2025, 05:58 PM IST

Deepfake: ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫేక్ వీడియోల బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌రోసారి డీప్‌ఫేక్ అంశం అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేసింది. ఈ నేప‌థ్యంలో డీప్‌ఫేక్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఈ వారం బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. 

PREV
110
డీప్‌ఫేక్ అంటే ఏంటి.?

డీప్‌‌ఫేక్ అంటే ఒక వ్యక్తి ముఖం, ముఖ భావాలు, వాయిస్ లేదా మొత్తం హావభావాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారంగా నకిలీగా రూపొందించడం. సాధారణంగా పాత ఫోటోలు, వీడియోలు, రికార్డ్‌ వాయిస్‌ల‌ను ఉపయోగించి కొత్తగా అశ్లీల, రాజకీయ ప్రకటనలు లేదా ఆర్థిక మోసాలకు తగ్గట్టు రియలిస్టిక్‌‌ వీడియో/ఆడియోలు తయారు చేస్తారు.

210
దీనికి ఏ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తారు.?

జెనరేటివ్ అడ్వర్సరియల్ నెట్‌వర్క్స్ (GANs): రెండు న్యూటల్ నెట్‌వర్క్‌లు (జెనరేటర్, డిస్క్రిమినేటర్) పోటీగా పని చేస్తూ అత్యంత రియ‌లిస్టిక్‌ ఇమేజ్/వీడియోని తయారుచేస్తాయి.

ఎంకోడర్-డీకోడర్ మోడ్యూల్స్: ఎంకోడర్ ఒక ముఖాన్ని సంక్షిప్తంగా “కోడ్” చేస్తుంది; డీకోడర్ ఆ కోడ్‌ను ఉపయోగించి మళ్ళీ ముఖాన్ని రూపొందిస్తుంది. దీంతో ఇలాంటి వీడియోల‌ను గుర్తించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది.

ఫేస్ సవాప్, లిప్ సింక్ అల్గోరిథమ్‌లు, వాయిస్ సింథసిస్: పాత వీడియోలో నేరుగా వేరే వ్యక్తి ముఖాన్ని అంటించే విధానం, లిప్ మూవ్స్ సరిచేయటం, ఆధునిక TTS (text-to-speech) వాయిస్ క్లోన్ చేయడం వంటివి ఉపయోగిస్తారు.

310
ఎవ‌రినీ వ‌ద‌ల‌ని కేటుగాళ్లు..

కొంత‌మంది స‌రదాగా, మ‌రికొంద‌రు నేర‌ప్ర‌వృతితో సినీ, రాజ‌కీయ సెల‌బ్రిటీల‌ను టార్గెట్ చేస్తూ వీడియోల‌ను రూపొందిస్తున్నారు. న‌టి ర‌ష్మిక మంద‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారి విష‌యం తెలిసిందే. దీనిపై ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా స్పందించారు. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఈ డీప్‌ఫేక్ వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా టార్గెట్ అయ్యారు. చిరు ఫొటోల‌తో ఏకంగా అశ్లీల చిత్రాల‌ను రూపొందించారు. దీంతో చిరంజీవి వెంట‌నే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయ‌గా విచార‌ణ మొద‌లుపెట్టిన పోలీసులు.. సోషల్ మీడియా నుండి పోస్టులను తొలగించారు.

410
డీప్‌‌ఫేక్‌ వల్ల కలిగే ప్రమాదాలు

* ప్ర‌తిష్ట‌త‌కు భంగం: సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖుల ఖ్యాతి దెబ్బతినచ్చు.

* ఆర్థిక మోసం: ఇలాంటి ఫేక్ వీడియోల‌ను సృష్టించి త‌ప్పుడు పెట్టుబ‌డి సూచ‌న‌లు చేయ‌డం లేదా భ‌య‌పెట్టి డ‌బ్బులు వ‌సూలు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

* వ్యక్తిగత భద్రతా హాని; బ్లాక్‌‌మెయిల్: ఫేక్స్‌తో బ్లాక్‌‌మెయిల్ చేసి డబ్బు మోస‌పోయే అవ‌కాశాలు ఉన్నాయి.

510
డీప్‌‌ఫేక్ వీడియోల‌ను ఎలా గుర్తించాలి.?

* కళ్ల కదలికలు (Blink Pattern): డీప్‌‌ఫేక్‌లో కళ్లు సహజంగా క‌నిపించ‌వు. అదేవిధంగా క‌ళ్లు అస‌హ‌జంగా ఎక్కువ సార్లు బ్లింక్ అవుతుంటే అది ఫేక్ వీడియోగా భావించాలి.

* లిప్‌-ఆడియో సింక్‌: వీడియోలో వ‌చ్చే సౌండ్‌, అందులో ఉన్న వ్య‌క్తి పెద‌లు సింక్ అవ్వ‌క‌పోయినా అనుమానించాలి.

* అవుట్‌‌ఆఫ్ కలర్స్: ముఖం రంగు అస‌హ‌జంగా ఉన్నా. మ‌రీ ఎక్కువ‌గా బ్రైట్‌గా క‌నిపిస్తున్నా డీప్‌‌ఫేక్‌గా అనుమానించాలి.

* కంటెంట్ సోర్స్ చెక్: వీడియో ఏ అకౌంట్ నుంచి వచ్చిందో పరిశీలించండి. వెరిఫైడ్ అకౌంట్స్ కాకపోతే జాగ్రత్తగా ఉండాలి.

* కొన్ని ర‌కాల టూల్స్‌: డీప్‌ఫేక్ వీడియోల‌ను గుర్తించేందుకు కొన్ని ర‌కాల ఏఐ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కూడా ఫేక్ వీడియోల‌ను గుర్తించ‌వ‌చ్చు.

610
నిబంధనలు, చట్టం ఏం చెబుతోంది.?

ప్రభుత్వ, పార్లమెంటరీ కమిటీలు ఆ ఐటీ/సమాచార శాఖలతో కలిసి AI, డీప్‌‌ఫేక్ నియంత్రణపై చర్చలు జరుపుతున్నాయి. కొంతమంది ప్రతిపాదనల ప్ర‌కారం.. కృత్రిమ మేధ ఆధారిత కంటెంట్‌కి లైసెన్సింగ్, నిర్దిష్ట ప్రమాణాల వంటివి ప్ర‌స్తుతం చ‌ర్చ‌లో ఉన్నాయి.

ప్లాట్‌ఫాంల బాధ్యత

* మేజర్ ప్లాట్‌ఫాం‌లు (యూట్యూబ్, రెడిట్, ఇన్‌స్టాగ్రామ్) ఫ్లాగ్ చేసిన డీప్‌ఫేక్ వీడియోల‌ను తొల‌గించే సిస్ట‌మ్ ఉండాలి.

* వేరే దేశాల నుంచి అప్లోడ్ అయితే కూడా ట్రేస్ చేయగల ఐపి, CDN రికార్డుల ఆధారంగా సహకారం ఉండాలి.

* నిందితుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా చట్టాల ఉండాలి.

710
సాంకేతిక‌ పరిష్కారాలు

ఫాంటిక్ వాట‌ర్ మార్కింగ్, వీడియో వెరిఫికేషన్ ప్రోటోకాల్‌లు, ఫ్లింట్‌-లెవెల్ సిగ్నేచర్లు లాంటి టెక్ సోల్యూషన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి.

AI ఆడిటింగ్ టూల్స్ — కంటెంట్ ఉత్పత్తి సమయంలో ట్రాక్ చేయడానికి “provenance”/source-tags ఉపయోగించడం చర్చలో ఉంది.

ఫైనల్ యూజర్ టూల్స్ — సామాన్యులు సరళంగా డీప్‌‌ఫేక్ సంకేతాల్ని అందరికి చూపించే యాప్‌లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి.

810
అవ‌గాహణ పెంచాలి

* డిజిటల్‌ లిటరసీ విస్తరణ: పాఠశాలల నుంచి వృద్ధులకు వరకు డిజిటల్ సేఫ్టీ నేర్పించాలి.

* మీడియా నైతికత: ఆరోపణలని పబ్లిష్ చేసే ముందు మూలాలను వెరిఫై చేయాలి. రిపోర్టింగ్ నిబంధనలు పునరుద్ధరించాలి.

* పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెన్స్‌: డీప్‌‌ఫేక్‌ గురించి ఆరెంజ్-అలర్ట్ స్థాయి ప్రచారాలు అవసరం.

910
మ‌న బాధ్య‌త ఏంటంటే.?

* అనుమానంగా ఉన్న వీడియోలను వెంటనే షేర్ చేయొద్దు.

* మీ వ్యక్తిగత డేటాను పబ్లిక్‌గా పెట్ట‌కండి.

* 2FA/పాస్‌వర్డ్స్ బలంగా ఉండేలా చూసుకోండి.

* డీప్‌ఫేక్ స‌మ‌స్య ఎదురైతే సాక్ష్యాలు సేకరించి సైబర్ క్రైమ్, న్యాయ స‌ల‌హాలు కోరండి.

1010
మొత్తం మీద‌..

AI, డీప్‌‌ఫేక్ వంటి టెక్నాలజీలు మన జీవితాలను సౌకర్యవంతం చేయగలవు. అదే సమయంలో అవి ఇబ్బందుల‌ను కూడా తీసుకొస్తాయి. చిరంజీవి, రష్మిక వంటి ప్రముఖులపై జరిగిన సంఘటనలు మ‌న‌కు వేక‌ప్ కాల్ లాంటివి. టెక్నాలజీని క‌చ్చితంగా నియంత్రించాలి. ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ, సోష‌ల్ మీడియా యాజ‌మాన్యాలు, ప్రజలు కలిసి చర్యలు తీసుకుంటే మాత్రమే ఈ కొత్త మోసరూపాలను అడ్డుకుంటాం. చివరగా సోషల్‌ మీడియాలో చూసే ప్రతీ విషయం నిజం అనుకోవద్దు, నాణేనికి మ‌రో వైపు కూడా ఉంటుంద‌న్న విష‌యాన్ని గుర్తించాలి.

Read more Photos on
click me!

Recommended Stories