ఐఫోన్‌కి గ‌ట్టిపోటీ.. అదిరిపోయే ఫోన్ లాంచ్ చేసిన రియ‌ల్ మీ. ఇవేం ఫీచ‌ర్లు బాబోయ్‌..

Published : Nov 20, 2025, 03:46 PM IST

Realme GT 8 Pro: చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్‌మీ మార్కెట్లోకి జీటీ 8 ప్రో పేరుతో కొత్త ఫోన్ తీసుకొచ్చింది. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్ల‌ను అందించింది. 

PREV
15
ధ‌ర ఎంతంటే.?

Realme GT 8 Pro భారతదేశంలో రూ. 72,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా బ్రాండ్ ఒక ప్రత్యేక డ్రీమ్ ఎడిష‌న్‌ను కూడా ప్ర‌క‌టించింది. దీనిని మాస్ట‌న్ మార్టిన్ ఆరామ్‌కో ఎఫ్‌1 టీమ్ నుంచి ప్రేరణగా త‌యారు చేశారు. ఈ ఫోన్ ధ‌ర రూ. 79,999గా ఉంది. నవంబ‌ర్ 20వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కాగా న‌వంబ‌ర్ 25వ తేదీ నుంచి రియ‌ల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ‌కానికి రానున్నాయి.

25
అత్యంత శ‌క్తివంత‌మైన ప్రాసెస‌ర్

ఈ ఫోన్‌లో క్వాల్కమ్ అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెస‌ర్‌ను అందించారు. రియ‌ల్‌మీకి చెందిన హైప‌ర్ విజ‌న్‌+ ఏఐ చిప్‌ను కూడా యాడ్ చేయ‌డంతో ఈ ఫోన్ ప‌నితీరు మ‌రింత మెరుగ‌వుతుంది. ఇక గేమింగ్ ల‌వ‌ర్స్ కోసం ఏఐ గేమింగ్ సూప‌ర్ ఫ్రేమ్ ఇంజ‌న్‌, 7కే అల్టిమేట్ వీసీ కూలింగ్ సిస్ట‌మ్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు. దీంతో ఎంత‌సేపు గేమ్స్ ఆడినా ఫోన్ వేడెక్క‌దు.

35
కెమెరాకు ప్రాధాన్య‌త

ఈ ఫోన్‌లో కెమెరాకు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చారు. Realme GT 8 Pro కెమెరా సిస్టమ్‌ను జపాన్‌కు చెందిన ప్రఖ్యాత Ricoh కంపెనీతో కలిసి రూపొందించారు. ఇందులో 28mm & 40mm ఫోకల్ లెంథ్‌తో ప్రధాన కెమెరాను ఇచ్చారు. వేగంగా ఫోకస్ అయ్యేందుకు స్నాప్ ఫోక‌స్ మోడ్‌, 200MP టెలిఫోటో లెన్స్ – 12x lossless zoom, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, వీడియోప‌రంగా చూస్తే.. 4K@120fps, 8K@30fps టెక్నాల‌జీని అందించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో.. స్విచ‌బుల్ కెమెరా బంప్ ఫీచ‌ర్‌ను ఇచ్చారు. దీంతో కెమెరా భాగాన్ని తీసి, వేరే స్టైల్‌తో మార్చుకోవచ్చు. ఫోన్లను వ్యక్తిగత స్టైల్‌కి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఇది మొదటిసారి.

45
డిస్‌ప్లే, ఆడియో

ఈ ఫోన్‌లో 2K HyperGlow Display ఉంది. ఇది అత్యంత స్పష్టతతో, మాక్స్ బ్రైట్‌నెస్ 7,000 nits వరకు అందిస్తుంది. ఆడియో కోసం సిమెట్రిక్ స్టీరియో స్పీకర్లు, అలాగే మెరుగైన వైబ్రేషన్ మోటార్ ఇవ్వడంతో గేమింగ్ & వీడియో అనుభవం మరింత రిచ్‌గా ఉంటుంది.

55
భారీ బ్యాటరీ

రియ‌ల్‌మీ జీటీ8 ప్రోలో 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేశారు. ఈ కాంబినేషన్‌తో ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటలకు పైగా వీడియోలు వీక్షించ‌వ‌చ్చు. 8 గంటలకు పైగా హెవీ గేమింగ్ ఆడుకోవ‌చ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 బేస్డ్ రియ‌ల్‌మీయూఐ 7.0తో ప‌నిచేస్తుంది. ఏఐ నోటిఫై బ్రీఫ్‌, ఏఐ స్మార్ట్ రిప్లై, మ‌ల్టీటాస్క్ సైడ్‌బార్ (ఒకేసారి 12 యాప్స్ రన్ చేసే సపోర్ట్) వంటి కొత్త AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories