జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్ కి 5.5-అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్ కం క్యూఎం215 ప్రాసెసర్, 2జిబి లేదా 3జిబి ర్యామ్, 16జిబి లేదా 32జిబి స్టోరేజ్ ఆప్షన్ పొందుతుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 308 జిపియూ అందుబాటులో ఉంటుంది. జియో ఫోన్ నెక్స్ట్ కెమెరాతో గూగుల్ లెన్స్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా చాలా రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. పోర్ట్రెయిట్ మోడ్ కూడా కెమెరాలో ఉంటుంది.