రియల్‌మీ మొట్టమొదటి టాబ్లెట్‌ ప్యాడ్‌.. కొనుగోలు చేసేందుకే ఈరోజే సూపర్ ఛాన్స్..

First Published Sep 16, 2021, 2:40 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రియల్‌మీ  ఈ రోజు మొట్టమొదటి టాబ్లెట్ రియల్‌మీ ప్యాడ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రియల్‌మీ ప్యాడ్ డిజైన్ చాలా స్లిమ్ గా ఉంటుంది, దీనికి నాలుగు స్పీకర్‌లు ఇచ్చారు. నేడు అంటే సెప్టెంబర్ 16న రియల్‌మీ ప్యాడ్‌ను మొదటిసారి కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. 

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ నుండి రియల్‌మీ ప్యాడ్ సేల్ ప్రారంభం కానుంది. రియల్‌మీ ప్యాడ్‌ ఫీచర్ల గురించి మాట్లాడితే మీడియా టెక్ హీలియో జి80 ప్రాసెసర్ దీనిలో ఇచ్చారు. అంతేకాకుండా డాల్బీ అట్మోస్ సౌండ్‌కు సపోర్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ రియల్‌మీ  ప్యాడ్‌కి సపోర్ట్  చేస్తుంది. వై-ఫై అండ్ వై-ఫై + 4జి రెండు  వేరియంట్‌లో టాబ్లెట్ ని ప్రవేశపెట్టరు. రియల్‌మీ  ఈ ట్యాబ్ ఇటీవల లాంచ్ చేసిన శామ్‌సంగ్ టాబ్ ఏ7 లైట్‌తో పోటీపడుతుంది.
 

రియల్‌మీ ప్యాడ్ ధర

వై-ఫైతో 32జి‌బి స్టోరేజ్, 3జి‌బి ర్యామ్ ధర రూ .13,999 కాగా, ఈ స్టోరేజ్‌తో వై-ఫై + 4జి వేరియంట్ ధర రూ .15,999. 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ ఉన్న  వై-ఫై+ 4జి మోడల్ ధర రూ .17,999. ఈ మూడు వేరియంట్‌లను రియల్ గోల్డ్, రియల్ గ్రే కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. వై-ఫై + 4జి మోడల్ టాబ్  సేల్స్ నేడు ప్రారంభం కాగా, ప్రస్తుతం వై-ఫై మోడల్ లభ్యతపై సమాచారం లేదు.

రియల్‌మీ ప్యాడ్  స్పెసిఫికేషన్‌లు

రియల్‌మీ ప్యాడ్‌ స్పెసిఫికేషన్‌లలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మి యుఐ, 10.4-అంగుళాల WUXGA + డిస్‌ప్లేతో 2000x1200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఉంటుంది. నైట్ మోడ్‌తో బ్రైట్ నెస్ 2 నిట్‌లకు తగ్గించవచ్చు. ఈ టాబ్ మీడియాటెక్ G80 ప్రాసెసర్, 4జి‌బి ర్యామ్, 64జి‌బి స్టోరేజ్ ద్వారా శక్తినిస్తుంది.
 

రియల్‌మీ ప్యాడ్ కెమెరా అండ్ బ్యాటరీ

కెమెరా గురించి మాట్లాడితే రియల్‌మీ ఈ మొట్టమొదటి ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా దానితో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్‌కు సపోర్ట్ లభిస్తుంది. ట్యాబ్ బాడీ అల్యూమినియంతో తయారు చేశారు. దీని బరువు 440 గ్రాములు.  డాల్బీ అట్మోస్, హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ తో నాలుగు డైనమిక్ స్పీకర్లను ఇచ్చారు.  ఇంకా నాయిస్ క్యాన్సలేషన్ తో డ్యూయల్ మైక్రోఫోన్‌ కూడా  ఉంది. ఈ ట్యాబ్‌లో స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ఇచ్చారు, దీని ద్వారా మీరు మీ రియల్‌మీ బ్యాండ్ లేదా వాచ్ నుండి ట్యాబ్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఈ రియల్‌మీ ప్యాడ్ 7100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, అలాగే 18W క్విక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

click me!