ఆపిల్ ఐఫోన్ 13 vs ఐఫోన్ 12: ఈ కొత్త సిరీస్ లో తేడా, ప్రత్యేకతలు ఏంటో ప్రతిదీ తెలుసుకోండి..

First Published Sep 16, 2021, 11:56 AM IST

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ సరికొత్త ఐఫోన్ సిరీస్ తాజాగా లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. సెప్టెంబర్ 14న ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ ని ఆపిల్ ఈవెంట్ లో ఆవిష్కరించింది. అయితే ఐఫోన్ 13 సిరీస్ ధర కూడా ఐఫోన్ 12 సిరీస్ ప్రారంభ ధరతో సమానంగా ఉంటుంది. 

ఐఫోన్ 12 సిరీస్ ప్రారంభ ధర రూ. 69,900. ఈ ధర వద్ద మీకు ఐఫోన్ 12 మినీ 64 జిబి మోడల్ లభిస్తుంది, ఇప్పుడు ఐఫోన్ 13 మినీ ప్రారంభ ధర కూడా రూ. 69,900 వద్ద ఉంచారు, అయితే ఈ ధరకి 128 జిబి వేరియంట్ పొందవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఐఫోన్ 13 సిరీస్ ఐఫోన్ 12 సిరీస్ కంటే చౌకగా అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 12తో పోలిస్తే ఐఫోన్ 13లో కొత్తదనం ఏంటో తెలుసుకుందాం..?

బేస్ వేరియంట్ 128 జి‌బి

ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌తో 64జి‌బి స్టోరేజ్ ఆప్షన్ తొలగించింది, అంటే ఐఫోన్ 13 సిరీస్ బేస్ వేరియంట్ ఇప్పుడు 128జి‌బిగా మారింది. ఆపిల్ 64జి‌బి స్టోరేజ్ ఆప్షన్ తొలగించడం ఇదే మొదటిసారి.
 

మొదటిసారి 1టి‌బి స్టోరేజ్ ఆప్షన్

ఆపిల్ ఐఫోన్ 13తో 64జి‌బి స్టోరేజ్ తొలగించి  1టి‌బి స్టోరేజీని అందించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆపిల్ ఐఫోన్‌లలో 1టి‌బి స్టోరేజీని ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. గతంలో గరిష్ట స్టోరేజ్ ఆప్షన్ 512జి‌బి వరకు మాత్రమే అందుబాటులో ఉండేది.

పాత ధరకే  మరింత ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్

ఐఫోన్ 12 మినీని గత సంవత్సరం రూ. 69,900  ప్రారంభ ధరతో ప్రవేశపెట్టారు, అయితే ఈ ధర 64 జి‌బి అంటే బేస్ వేరియంట్ కోసం మాత్రమే, అయితే ఇప్పుడు ఐఫోన్  13 మినీ కూడా రూ. 69,900 ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది, కానీ ఈసారి మీరు రూ. 128జి‌బి స్టోరేజ్ పొందుతారు. అంటే ఐఫోన్  12 సిరీస్ కంటే ఐఫోన్  13 సిరీస్ చౌకగా ఉంటుంది.
 

చిన్న నాచ్ తో ప్రమోషన్ డిస్ ప్లే

సాధారణంగా చాలా వరకు మొబైల్ తయారీదారులు స్మార్ట్‌ఫోన్‌తో అడప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను అందిస్తారు. ఉదాహరణకు రిఫ్రెష్ రేట్ 30Hz నుండి 120Hz మధ్య ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో లభిస్తుంది, అయితే ఆపిల్ 10Hz నుండి 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను ఇచ్చింది. ఆపిల్ దీనికి అడాప్టివ్‌కి బదులుగా ప్రమోషన్ డిస్‌ప్లే అని పేరు పెట్టింది. అంతే కాకుండా ఐఫోన్ 13 సిరీస్ నాలుగు  వేరియంట్ ఫోన్‌లలో నాచ్ తగ్గించబడింది. ఈ కారణంగా మీరు పాత మోడల్ కంటే పెద్ద స్క్రీన్‌ను పొందుతారు.
 

సినిమాటిక్ మోడ్

ఐఫోన్ 13 సిరీస్‌తో ఆపిల్ ఇపుడు సినిమాటిక్ మోడ్‌ను ఇచ్చింది, ఇది ఈ సిరీస్‌లో వస్తున్న అత్యంత ప్రత్యేకమైన ఫీచర్. సినిమాటిక్ మోడ్ సహాయంతో  ఐఫోన్  13 సిరీస్ యూజర్లు ఐఫోన్‌ల నుండి ఏదైనా ఖరీదైన కెమెరా లాంటి ఫిల్మ్‌లను షూట్ చేయగలరు. సినిమాటిక్ మోడ్‌లో ఐఫోన్ కెమెరా  ఆబ్జెక్ట్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ మధ్య ఫోకస్ అండ్ డిఫోకస్ ఆటోమేటిక్ గా చేస్తుంది. దీంతో మీరు మొబైల్ నుండి సినిమాటిక్ స్టైల్‌లో వీడియోగ్రఫీ చేయగలరు.

click me!