రాబోయే రోజుల్లో టెలికాం కంపెనీల ప్లాన్ల ధరలు పెరగవు అని మీరు భావిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే మారుతున్న మార్కెట్ ధోరణి సూచిస్తుంది. త్వరలో రిలయన్స్ జియో(reliance jio), ఎయిర్‌టెల్(airtel), వొడాఫోన్ ఐడియా(vodafone idea) ప్రీ-పెయిడ్ ప్లాన్‌లు ఖరీదైనవి కావచ్చు, అయితే మూడు కంపెనీల సెలెక్టెడ్ చేసిన కొన్ని ప్లాన్‌లు మాత్రమే ఖరీదైనవిగా మారనున్నయి కానీ అన్ని ప్లాన్‌లు కాదు.
ప్లాన్ల ధరలు ఎందుకు పెరగనున్నాయి
తాజాగా అమెజాన్ అమెజాన్ ప్రైమ్(amazon prime) సబ్‌స్క్రిప్షన్ ఫీజును పెంచింది. దీంతో ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ 50 శాతం వరకు ఖరీదైనదిగా మారనుంది. అయితే గత కొంతకాలంగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ ప్లాన్‌లతో ఉచితంగా లభిస్తుంది, అయితే సబ్‌స్క్రిప్షన్ ధర పెంపు కారణంగా ఈ ప్లాన్‌ల ధరలు కూడా పెరగవచ్చు.
మరోవైపు ప్రీపెయిడ్ ప్లాన్‌లతో అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ తొలగించే అవకాశం కూడా ఉంది, అంటే ఇంతకుముందులాగా అమెజాన్ లేదా ఏ ఇతర (OTT) సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొత్త ప్లాన్‌లు రావొచ్చు. సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్న టెలికాం కంపెనీలు కూడా దీని ద్వారా ప్రభావితమవుతాయని అమెజాన్ స్పష్టంగా చెప్పింది.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర
కొత్త అప్‌డేట్ తర్వాత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.999 ప్యాక్ ధర రూ.1,499 అవుతుంది. దీని వాలిడిటీ 12 నెలలు. రూ .329 త్రైమాసిక ప్లాన్ ధర రూ .459, ప్రతి నెల ప్లాన్ రూ .129 రూ .179 అవుతుంది. అమెజాన్ ఈ పెంపు ఎప్పటి నుంచి అనే తేదీని సెట్ చేయనప్పటికీ కొత్త ధరలు త్వరలో అమలుకానుంది. అమెజాన్ ప్రైమ్ ఐదేళ్ల క్రితం భారతదేశంలో ప్రవేశపెట్టరు, అయితే కొత్త ధరలు ఎప్పుడు వర్తిస్తాయి అనే దానిపై అమెజాన్ ఎటువంటి తేదీని వెల్లడించలేదు.
అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలు
ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్‌లు ప్రత్యేక ఆఫర్‌లను, సేల్ సమయంలో ఇతర కస్టమర్ల ముందు షాపింగ్ చేసే అవకాశాన్ని పొందుతారు. అంతేకాకుండా, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో అలెక్సాను యాక్సెస్ చేసే అవకాశం కూడా ఉంది.