రిలయన్స్ ప్రకారం, జియోఫోన్ నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అండ్ మేడ్ బై ఇండియన్స్ ఫోన్. లక్షలాది మంది భారతీయుల జీవితాలను మార్చే శక్తి జియోఫోన్ నెక్స్ట్‌కు ఎలా ఉందని కంపెనీ ఈ వీడియోలో వివరిస్తుంది.
గత 5 సంవత్సరాల వ్యవధిలో జియో భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంటి మనిషిగా మారింది. 430 మిలియన్ల వినియోగదారులతో
జియోగ్రాఫిక్, ఎకనామిక్, సోషల్ క్లాసెస్ కలిగి ఉంది. జియో ఫోన్ నెక్స్ట్ తో, జియో భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని ప్రజాస్వామ్యీకరించే దాని దృష్టికి నిర్ణయాత్మక అడుగు.
ప్రగతి ఓఎస్
జియో ఫోన్ నెక్స్ట్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ చేత తయారు చేయబడిన ప్రపంచ స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకా భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడింది. ప్రగతి ఓఎస్ జియో ఇంకా గూగుల్ నుండి ఉత్తమ టెక్నికల్ నిపుణులచే అభివృద్ధి చేయబడింది. పేరు సూచించినట్లుగా బడ్జెట్ ధరలో అత్యుత్తమ అనుభవంతో అందరికీ పురోగతిని నిర్ధారించడం దీని లక్ష్యం.
జియోఫోన్ నెక్స్ట్ ప్రాసెసర్
జియోఫోన్ నెక్స్ట్ ప్రాసెసర్ కూడా టెక్నాలజీ లీడర్ క్వాల్‌కామ్ దీనిని అభివృద్ధి చేసింది. జియో ఫోన్ నెక్స్ట్ లో ఇన్‌స్టాల్ చేసిన క్వాల్‌కామ్ ప్రాసెసర్ ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ ప్రాసెసర్ ఆప్టిమైజ్ చేసిన కనెక్టివిటీ, లొకేషన్ టెక్నాలజీ, ఆడియో, మెరుగైన బ్యాటరీ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది, అయితే కంపెనీ ప్రాసెసర్ మోడల్ లేదా ఫోన్ ధర గురించి సమాచారం వెల్లడించలేదు. అయితే ఫోన్ కొన్ని ప్రత్యేక ఫీచర్స్ గురించి..
జియో ఫోన్ నెక్స్ ప్రత్యేకమైన ఫీచర్లు
వాయిస్ అసిస్టెంట్
వాయిస్ అసిస్టెంట్ వినియోగదారులకు డివైజ్ ఆపరేట్ చేయడానికి (యాప్‌లను తెరవడం, సెట్టింగ్‌లను మ్యానేజ్ చేయడం మొదలైనవి) అలాగే వారి స్వంత భాషలో ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని/కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.
చదవడం-వినడం
'వినండి'(listen)ఫంక్షన్ వినియోగదారుని డివైజ్ స్క్రీన్ పైన ఉన్న కంటెంట్‌ను చదవడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు అర్థం చేసుకోగలిగే భాషలో చదవడం ద్వారా కంటెంట్‌ని వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది.
అనువాదం (translate)
వినియోగదారుడు తనకు నచ్చిన భాషలో స్క్రీన్ పైన ఉన్న కంటెంట్ లేదా టెక్స్ట్ అనువదించడానికి వీలు కల్పిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన భాషలో ఏదైనా కంటెంట్‌ను వినడానికి కూడా సహాయపడుతుంది.
జియో ఫోన్ కెమెరా
ఈజీ అండ్ స్మార్ట్ కెమెరా
ఈ డివైజ్ పోర్ట్రెయిట్ మోడ్‌తో సహా వివిధ ఫోటోగ్రఫీ మోడ్‌లతో కూడిన స్మార్ట్ అండ్ శక్తివంతమైన కెమెరా అమర్చబడి వస్తుంది. వినియోగదారుడు కావాలనుకుంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ (object)దృష్టిలో ఉంచుకుని దాని చుట్టూ ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ని ఆటో మోడ్‌లో బ్లర్ చేయవచ్చు, ఇంకా చాలా గొప్పగా ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ జియో ఫోన్ లో 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది. తక్కువ వెలుతురులో కూడా నైట్ మోడ్ తో గొప్ప ఫోటోలను తీయడానికి సహాయపడుతుంది. కెమెరా యాప్ ఇండియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్‌తో ప్రీ లోడ్ చేయబడింది. అంటే, చాలా ఫిల్టర్‌లు కెమెరాలో ముందే లోడ్ చేసి ఉంటాయి.
ప్రీలోడెడ్ జియో అండ్ గూగుల్ యాప్స్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని అండ్రాయిడ్ యాప్‌లను ఈ డివైజ్ లో ఉపయోగించవచ్చు. వీటిని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మిలియన్ల యాప్‌ల నుండి ఏదైనా యాప్‌ను ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంది. ఇంకా ఎన్నో జియో అండ్ గూగుల్ యాప్‌లతో ప్రీలోడ్ చేయబడింది.
जियो फोन नेक्सट
ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్
జియో ఫోన్ నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్ అప్‌డేట్‌తో అప్‌డేట్ అవుతుంది. జియో ఫోన్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఫీచర్స్ ఆటోమేటిక్ గా మెరుగుపడతాయి. ఇంకా ఇంటర్నెట్ సమస్యలను నివారించడానికి సెక్యూరిటి అప్ డేట్స్ తో కూడా వస్తుంది.
అమేజింగ్ బ్యాటరీ లైఫ్
ఆండ్రాయిడ్ ఆధారిత కొత్తగా డిజైన్ చేయబడిన ప్రగతి ఓఎస్ అయితే అత్యుత్తమ పనితీరును, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.