వాట్సాప్, ఇన్స్తగ్రామ్ వెబ్ ఇంకా స్మార్ట్ ఫోన్స్ రెండింటిలో పనిచేయ లేదు. ఈ సమస్య అన్ని అండ్రాయిడ్, ఐఓఎస్ వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో సంభవించింది. ప్రజలు కొత్త మెసేజెస్ పొందడం లేదా పంపడంలో సమస్యలు ఎదురుకొన్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్ రిఫ్రెష్‌లో 'కాంట్ రిఫ్రెష్' అనే మెసేజ్ కనిపించింది.
DownDetectorలో ప్రజలు వాట్సాప్ పనిచేయకపోవడంపై ఫిర్యాదు చేశారు. అలాగే ఇన్స్తగ్రామ్, ఫేస్ బుక్ గురించి కూడా ఫిర్యాదు చేసారు. ఇంకా మెసేజ్ పంపకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Downdetector.com ప్రకారం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు, సర్వర్ డౌన్ కావడంతో సుమారు 50వేల మంది ఫిర్యాదులు చేశారు అని పేర్కొంది.