ఇ-మెయిల్, జి‌-మెయిల్ అంటే ఏంటి..? ఈ రెండింటికి మధ్య తేడా మీకు తెలుసా..?

First Published | Oct 4, 2021, 4:49 PM IST

మనమందరం ప్రతిరోజూ చాలా వరకు గూగుల్ సేవలను ఉపయోగీస్తుంటాము. అది గూగుల్ మ్యాప్స్, జి-మెయిల్ లేదా మరేదైనా కావచ్చు. వీటన్నిటి మధ్య జి-మెయిల్ అండ్ ఇ-మెయిల్ మధ్య తేడా ఏమిటి అనే ప్రశ్న మీలో  ఎప్పుడైనా తలెత్తిందా..? ఒకోసారి ఈ రెండింటి గురించి మనం తరచుగా గందరగోళానికి కూడా గురవుతాము. 

ఈ రోజు మనం జి-మెయిల్ ఇంకా  ఇమెయిల్ మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం..? అయితే,  ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక మెసేజ్ లేదా సమాచారం చేరడానికి చాలా రోజులు సమయం పట్టేది. కానీ కొన్ని దశాబ్దాల తరువాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉద్భవించాయి, ఇవి సమాచార రంగాన్ని మార్చివేసాయి. ఈ కారణంగా నేటి ఆధునిక శకం సమాచార విప్లవ యుగంగా మారింది. ఇప్పుడు ఉన్న పెద్ద  పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్షణంలో మీరు సమాచారాన్ని మరొకరికి పంపవచ్చు. అయితే  జి-మెయిల్ అండ్ ఇ-మెయిల్ మధ్య తేడా ఏమిటో చూద్దాం..?

ఇ-మెయిల్

ఇ-మెయిల్  అర్థం ఎలక్ట్రానిక్ మెయిల్ అని. మీరు ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించి మెసేజ్ లేదా సమాచారం పంపినట్లయితే దానిని ఇ-మెయిల్ అంటారు. ఒక వ్యక్తి ఈమెయిల్  అనేది చిరునామా వంటిది. సమాచారాన్ని పంపడానికి ఈ చిరునామాను ఉపయోగిస్తాము. అయితే సమాచారాన్ని పంపే మాధ్యమంలో చిరునామాను కూడా జోడించాల్సి ఉంటుంది.

Latest Videos


జి‌-మెయిల్

మరోవైపు జి‌-మెయిల్ గురించి మాట్లాడితే, ఇమెయిల్ ద్వారా మెసేజ్ పంపడం కోసం పని చేస్తుంది. ఈ ఉదాహరణ అర్ధం చేసుకోండీ ఏంటంటే @gmail.comని మన ఇ-మెయిల్ అడ్రస్ తర్వాత జోడిస్తాము. అయితే ఈ  మెసేజ్ పంపే పనిని గూగుల్ చేస్తున్నట్లు చూపుతుంది.

మరోవైపు ఈ ఇ-మెయిల్ అడ్రస్ @outlook.comని అనుసరిస్తే మైక్రోసాఫ్ట్ ఈ మెసేజ్ పంపడానికి పని చేస్తోందని అర్ధం.  అలాగే దీనిని మన ఈమెయిల్ అడ్రస్ అని అర్దం చేసుకోవచ్చు.

click me!