వావ్..అమెజింగ్ : ఒకవేళ ఇది నిజమైతే ఐఫోన్ 14 ఈ ఫీచర్ తో లాంచ్ కావొచ్చు..

First Published Oct 4, 2021, 6:48 PM IST

అమెరికన్ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఆపిల్  తాజాగా లాంచ్ చేసిన ఐఫోన్ 13 సిరీస్‌లో 64 జి‌బి స్టోరేజ్ ఆప్షన్ తొలగించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు అన్ని ఐఫోన్ 13 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ల లో  128జి‌బి  స్టోరేజ్ ఆప్షన్ తో మొదలవుతుంది. 

అంతేకాకుండా ఐఫోన్ 13 సిరీస్‌తో గరిష్ట స్టోరేజ్ సంబంధించి ఆపిల్ మరో పెద్ద మార్పు చేసింది. ఐఫోన్ 13 సిరీస్‌తో ఆపిల్ 1 టిబి వరకు స్టోరేజ్  ఆప్షన్ ఇచ్చింది, అంటే ఇప్పటి వరకు ఏ ఫోన్‌లలో కూడా అందుబాటులో లేని అత్యధిక స్టోరేజ్ ఆప్షన్.

ఐఫోన్ 13 సిరీస్ సేల్ తరువాత ఇప్పుడు ఐఫోన్ 14 సిరీస్ గురించి వార్తలు రావడం ప్రారంభించాయి. ఐఫోన్ 14 సిరీస్ 2 టి‌బి స్టోరేజ్‌ ఆప్షన్ తో అందిస్తుందని ఒక  కొత్త నివేదికలో పేర్కొనబడింది. టెక్నాలజీ వెబ్‌సైట్ మైడ్రైవర్స్ ఈ విషయాన్ని ఒక నివేదికలో పేర్కొంది. ఐఫోన్ 14 ప్రో మోడల్‌లో మాత్రమే 2 టిబి స్టోరేజ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

ఎందుకు ఇంత స్టోరేజ్ అవసరం?

తాజాగా ఆపిల్ 1 టి‌బి వరకు స్టోరేజ్ ఆప్షన్ ట్రెండ్‌ని ప్రారంభించింది, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా వాటి స్మార్ట్‌ఫోన్‌లలో ఇంత ఎక్కువ స్టోరేజ్‌తో అందించవచ్చు, అయితే ఇక్కడ ఒక స్మార్ట్‌ఫోన్‌కి ఎందుకు అంత స్టోరేజ్ అవసరం అనే పెద్ద ప్రశ్న వస్తోంది.  ఏంటంటే ? నిజానికి 4కే వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 13 ప్రోలో 30fps కోసం 4కే ProRes రికార్డింగ్‌తో పరిచయం చేశారు, దీనికోసం 256 జి‌బి స్టోరేజ్ ఇచ్చారు. 128 జి‌బి మోడల్‌లో అయితే ఈ ఫీచర్ 30fps వద్ద 1080 పిక్సెల్‌ల ఉంటుంది.  హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ కారణంగా స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ స్టోరేజ్ ఇవ్వబడుతుంది.

click me!