రిలయన్స్ జియో 5 సంవత్సరాల కార్యకలాపాలకి టెక్ ప్రపంచం అభినందనలు...

First Published Sep 6, 2021, 8:34 PM IST

గూగుల్ ఇండియా నుండి జోమాటో, నెట్‌ఫ్లిక్స్ నుండి పేటిఎమ్ వరకు  టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఐదు సంవత్సరాల కార్యకలాపాలను అభినందించెందుకు టెక్ ప్రపంచం క్య్యు కట్టింది. ఆశ్చర్యపోనవసరం లేదు, రిలయన్స్ జియో చౌక ధరలతో తీసుకువచ్చిన డేటా విప్లవానికి లబ్ధిదారులుగా ఉన్నారు.

బిలియనీర్ ముకేష్ అంబానీ టెలికాం రంగంలో జియోతో రీ-ఎంట్రీ ఇచ్చాక భారతదేశంలో డేటా వినియోగం 1,300 శాతం పెరిగింది ఇంకా  బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 5 సెప్టెంబర్ 2016 నుండి నాలుగు రెట్లు పెరిగింది.

హెచ్‌డి‌ఎఫ్‌సి "సర్ ఉత్కే జీనా కోయి తుమ్సే సీకే" అని చెప్పగా, హాట్‌స్టార్  "'స్కోర్ ఎంత ?' అని అడగడం నుండి లైవ్‌ చూసేవరకి , #5YearsOfJioకి అభినందనలు. " అని తెలిపింది.

గూగుల్, నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫోన్ పే, అపోలో హాస్పిటల్స్, అశోక్ లేలాండ్, టిండర్ ఇండియా, వూట్, జి5, స్యామ్సంగ్ ఇండియా, వివో, ఒప్పో, డొమినాస్ ఇండియా, సోని లైవ్ వంటివి ట్విట్టర్‌లో జియో 5వ వార్షికోత్సవం అభినందనలు తెలిపాయి. 

ఎం‌ఐ ఇండియా "భారతదేశంలో 5 సంవత్సరాల ఇంటర్నెట్ విప్లవానికి ఆజ్యం పోసింది" అని చెప్పగా, నోకియా "భారతదేశాన్ని కనెక్ట్ చేయడంలో మీ నిబద్ధతకు కృతజ్ఞతలు" అని తెలిపింది.


"తుమ్ జివో కరోడో సాల్!" అని భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ వాలెట్ సంస్థ పేటి‌ఎం చెప్పగా ఇ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం ఆన్ అకాడమీ "భారతదేశం డిజిటల్‌గా నేర్చుకోవడానికి ఎదగడానికి సహాయపడుతోంది!" చెప్పింది.

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో "పుట్టినరోజు కేక్ వస్తోంది!" అని చెప్పగా "#5YearsOfJio ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలికింది" అని మైక్రోమాక్స్ తెలిపింది.

ట్రాయ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్ స్క్రైబర్స్ నివేదిక ప్రకారం  గత 5 సంవత్సరాలలో డేటా వినియోగదారుల సంఖ్య 4 రెట్లు పెరిగిందని చూపిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ 2016లో 19.23 కోట్ల నుండి జూన్ 2021 నాటికి 79.27 కోట్లకు పెరిగింది.

ఇది ప్రతి వినియోగదారుడి నెలవారీ డేటా వినియోగంతో డేటా వినియోగంలో భారీ పెరుగుదలకు దారితీసింది,  878.63 ఎం‌బి నుండి 12.33జి‌బి వరకు పెరిగింది.

సెప్టెంబర్ 2016లో జియో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి  ట్రాయ్ ప్రచురించిన పనితీరు సూచికల నివేదికల ప్రకారం, ఇంటర్నెట్ డేటా ఖర్చు 93 % పైగా తగ్గిపోయింది.
 

జియో డిజిటల్ డివైడ్ విచ్ఛిన్నం చేసి, డిజిటల్ టెక్నాలజీ నిజమైన ప్రజాస్వామ్య యుగానికి నాంది పలికేందుకు సహాయపడిందని ఈ ప్రక్రియలో ప్రతి భారతీయుడికి సాధికారతనిస్తుంది అని నిపుణులు అన్నారు.

జియో డిజిటల్ విప్లవానికి ముందు భారతదేశంలో 10 యునికార్న్‌లు ఉన్నాయి, ఈ జాబితా ఇప్పుడు కనీసం 53కి పెరిగింది.

మరీ ముఖ్యంగా జియో డిజిటల్ రివొల్యూషన్ అందరిని ముందుకు తీసుకెళ్లింది. ఉదాహరణకు, భారతదేశంలో ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య 2016లో 20 కోట్ల మంది వినియోగదారుల నుండి రెండింతలు పెరిగి 2021లో 42 కోట్ల మంది వినియోగదారులకు పెరిగింది. అదేవిధంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా 2016లో 19 కోట్ల మంది వినియోగదారుల నుండి 2021లో 39 కోట్లకు పైగా పెరిగింది.

ఆన్‌లైన్ వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి, సరికొత్త వాల్యు చైన్స్  సృష్టించాయి. మధ్యవర్తులను తగ్గించి ధరలను సరసమైనదిగా చేస్తాయి. జొమాటో  సీఈఓ దీపీందర్ గోయల్ రిలయన్స్ జియో దేశంలో నూతన యుగం ఇంటర్నెట్ స్టార్టప్‌ల కోసం ఆవిష్కరించిన అవకాశాలను ప్రశంసించారు.

ప్రపంచంలోని అతి పెద్ద ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ కంపెనీ అయిన నెట్‌ఫ్లిక్స్ సి‌ఈ‌ఓ రీడ్ హేస్టింగ్స్ భారతదేశంలో స్ట్రీమింగ్ సేవల విజయం జియోకు ఘనతనిచ్చారు "ప్రతి దేశానికి స్వంత రిలయన్స్ జియో ఉండాలి " అని అన్నారు.

జియో డిజిటల్‌ ఎకానమీలో విప్లవాత్మక మార్పులు చేసింది. యూ‌పి‌ఐ చెల్లింపులు విలువ 200,000 రెట్లు పెరిగాయి, సంఖ్య పరంగా 400,000 రెట్లు పెరిగింది. యాప్ డౌన్‌లోడ్‌లు కూడా అద్భుతమైన వృద్ధిని సాధించాయి. 2016లో 6.5 బిలియన్ డౌన్‌లోడ్‌లు ఉండగా 2019లో ఈ సంఖ్య 19 బిలియన్లకు చేరుకున్నాయి.

click me!