మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్‌ ఆన్ చేయండి.. పాస్‌వర్డ్ తెలిసినా యాప్స్ ఓపెన్ చేయలేరు..

First Published Feb 18, 2021, 1:24 PM IST

మీ అండ్రాయిడ్ ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉందని మీకు తెలుసా.. మీరు కొన్ని చిట్కాలతో దీనిని సులభంగా ఉపయోగించవచ్చు. దీంతో మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను ఇతర వ్యక్తుల నుండి సేవ్ చేయవచ్చు. ఆ ఫీచర్ ఎంతో తెలుసుకోండి...

పిన్ ద స్క్రీన్ లేదా స్క్రీన్ పిన్నింగ్ అనే ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫీచర్ ఉపయోగించి మీ అనుమతి లేకుండా వేరే వ్యక్తి మీ ఫోన్‌ను యాక్సెస్ చేయలేరు. ఈ లక్షణం అండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పై వెర్షన్లలో లభిస్తుంది. శామ్సంగ్ ఫోన్లలో ఈ ఫీచర్ పిన్ విండోస్ అంటారు.
undefined
పిన్ స్క్రీన్ లేదా స్క్రీన్ పిన్నింగ్‌లో మీరు ఏదైనా యాప్ లాక్ చేయవచ్చు లేదా పిన్ చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు కోరుకుంటే తప్ప ఆ యాప్ మీ ఫోన్‌లో ఓపెన్ అవ్వదు. ఉదాహరణకు మీరు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించడానికి మీ ఫోన్‌ను ఎవరికైనా ఇస్తే ఆ యాప్ లాక్ చేయండి లేదా పిన్ చేయండి. దీని తరువాత ఇన్‌స్టాగ్రామ్ మినహా ఇతర యాప్స్ ఏవి వారు ఉపయోగించలేరు.
undefined
ఈ ఫీచర్ కోసం1.మొదట మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.2.ఫోన్ సెట్టింగులలో మీరు సెక్యూరిటీ & లాక్ స్క్రీన్ ఆప్షన్ చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.3.ఇప్పుడు ప్రైవసీ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ చూడవచ్చు. కింద మీరు పిన్ ది స్క్రీన్ లేదా స్క్రీన్ పిన్నింగ్ అనే ఆప్షన్ చూస్తారు.4.ఈ ఆప్షన్ పై నొక్కండి తరువాత దాన్ని ఆన్ చేయండి.
undefined
5.మీరు ఉపయోగించాలనుకుంటున్న యాప్ పిన్ చేయడానికి ముందు పిన్ తెరిచి, ఆపై దాన్ని మూసివేయండి.6.దీని తరువాత రీసెంట్ యాప్స్ ఆప్షన్ కి వెళ్లండి.7.మీరు ఇక్కడ పిన్ చేయదలిచిన యాప్ పై ఎక్కువసేపు నొక్కండి.8.దీని తరువాత పిన్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు పిన్ చేసిన యాప్ తప్ప మరేమీ ఓపెన్ కావు.
undefined
పిన్ ఆప్షన్ ఎలా తొలగించాలి?ఫోన్‌ను తిరిగి మీరు తీసుకున్న తర్వాత మీరు మీ హోమ్ అండ్ బ్యాక్ బటన్లను ఒకేసారి నొక్కాలి దొంతో పాటు పిన్ ఆప్షన్ తొలగించడానికి లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి ఆప్పుడే పూర్తయింది.
undefined
undefined
click me!