5 కామెరాలతో శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్.. హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేతో ఇండియాలో లాంచ్..

First Published | Feb 17, 2021, 2:21 PM IST

 శామ్‌సంగ్  కొత్త స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12ను ఇండియాలో విడుదల చేసింది. శామ్‌సంగ్  గెలాక్సీ ఎ12 మొదటిసారి ఐరోపాలో గెలాక్సీ ఎ02తో పాటు గతేడాది నవంబర్‌లో లాంచ్ అయింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12లో నాలుగు బ్యాక్ కెమెరాలతో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ప్రో, రియల్‌మీ 7, ఒప్పో ఎ52 లతో పోటీ పడనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 ధరశామ్‌సంగ్ గెలాక్సీ ఎ12 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999, 4 జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 17 నుండి శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్స్, ఇతర ఇ-కామర్స్ స్టోర్లు అలాగే ఆఫ్‌లైన్ స్టోర్లలో బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 12 స్పెసిఫికేషన్లుఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ కోర్ 2.5 ఓఎస్ ఉంది. 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్ 128 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది. స్టోరేజ్ మెమరీ కార్డ్ సహాయంతో 1 టిబి వరకు పెంచుకోవచ్చు.
undefined

Latest Videos


శామ్‌సంగ్ గెలాక్సీ ఎ12కెమెరా కెమెరా గురించి మాట్లాడితే ఈ శామ్‌సంగ్ ఫోన్ లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు ఎఫ్ 2.0, రెండవ లెన్స్ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా. ఫోన్ లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ లెన్స్ కెమెరా ఉంది, దీని ఎపర్చరు f2.2 ఉంది.
undefined
శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 12 బ్యాటరీశామ్‌సంగ్ గెలాక్సీ ఎ12లో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, కనెక్టివిటీ కోసం 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బరువు 205 గ్రాములు.
undefined
click me!