వై-ఫై సపోర్ట్ తో హిండ్‌వేర్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఎయిర్ కూలర్.. 5 నిమిషాల్లోనే మడత పెట్టి తెరవవచ్చు..

First Published Mar 10, 2021, 5:56 PM IST

సానిటరీ వేర్ బ్రాండ్ హిండ్‌వేర్ ఇండియాలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ ఎయిర్ కూలర్ 'ఐ-ఫోల్డ్' ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా కంపెనీ రెండు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ఎనేబుల్ ఎయిర్ కూలర్లను కూడా ప్రవేశపెట్టింది. రెండు కూలర్లను అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, హిండ్‌వేర్ వెబ్‌సైట్ www.evok.in నుండి కొనుగోలు చేయవచ్చు.

ఐ-ఫోల్డ్ కూలర్ తక్కువ స్థలం ఉన్న ఇళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కూలర్‌ను కేవలం ఐదు నిమిషాల్లో మడత పెట్టి తెరవవచ్చు. ఐ-ఫోల్డ్‌లో శక్తివంతమైన మోటారు అమర్చారు. దీనిలో డస్ట్ ఫిల్టర్ కూడా ఉంది. ఈ కూలర్ డిజైన్ కూడా ఫ్యాషన్ గా ఉంటుంది. ఐ-ఫోల్డ్ కూలర్ ధర రూ .19,990.
undefined
ఇప్పుడు రెండు ఐయోటి ఎనేబుల్డ్ కూలర్ల గురించి చెప్పాలంటే ఈ సిరీస్ కింద రెండు కూలర్లు ప్రారంభించారు, వీటిలో స్పెక్ట్రా ఐ-ప్రో 36 ఎల్, అకురా ఐ-ప్రో 70 ఎల్ ఉన్నాయి. ఈ రెండు కూలర్లలో అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది, అంటే మీరు మాట్లాడటం ద్వారా వాటిని కంట్రోల్ చేయవచ్చు. అలెక్సాతో కాకుండా వాటిని కంపెనీ యాప్ కి కూడా కనెక్ట్ చేయవచ్చు.
undefined
యాప్ ద్వారా కూలర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అంతేకాదు స్పీడ్, టైమర్, కూలింగ్ మోడ్, కూలర్ స్వింగ్ వంటివి యాప్ నుండి కంట్రోల్ చేయవచ్చు. రెండు కూలర్లలో కూడా గేస్చర్స్ కంట్రోల్స్ కూడా అందించారు. రెండు ఎయిర్ కూలర్లలో జియో-ఫెన్స్ టెక్నాలజీ ఉంది. వీటిలో స్పెక్ట్రా ఐ-ప్రో 36 ఎల్ ధర రూ .15,990, అకురా ఐ-ప్రో 70 ఎల్ ధర రూ .17,490.
undefined
click me!