థింక్‌షీల్డ్ టెక్నాలజితో మోటరోలా కొత్త 4జి స్మార్ట్‌ఫోన్‌లు.. తక్కువ ధరకే లాంచ్..

First Published | Mar 10, 2021, 1:04 PM IST

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా మోటో జి30, మోటో జి10 పవర్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత నెల ప్రారంభంలో మోటో జి30తో మోటో జి10ను యూరప్‌లో విడుదల చేయగా, మోటో జి10 పవర్ ని భారతదేశంలో తొలిసారిగా లాంచ్ చేసింది.

మోటరోలా ఈ రెండు కొత్త ఫోన్‌లలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ ప్లే ఇచ్చారు. ఇది కాకుండా ఫోన్ లో స్టాక్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ అందించారు. ఫోన్‌లో భద్రత కోసం పోర్ లేయర్ భద్రతతో కూడిన థింక్‌షీల్డ్ టెక్నాలజి అందించారు.
మోటో జి30, మోటో జి10పవర్ ధర భారతదేశంలో మోటో జి30 ధర రూ .10,999, దీనిని డార్క్ పెర్ల్ అండ్ పాస్టెల్ స్కై కలర్ వేరియంట్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌లో లభిస్తుంది. మోటో జి10 పవర్ ధర 9,999 రూపాయలు ఇది 64 జిబి స్టోరేజ్‌, 4 జిబి ర్యామ్‌తో లభిస్తుంది. ఈ ఫోన్‌ను అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. మోటో జి30 మార్చి 17 నుంచి, మోటో జి 10 పవర్ మార్చి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు.

మోటో జి30 స్పెసిఫికేషన్లుమోటో జి30లో ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.5-అంగుళాల హెచ్‌డి + డిస్ ప్లే, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి అలాగే దీనిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచుకోవచ్చు.
కెమెరా గురించి మాట్లాడితే మోటోరోల ఈ ఫోన్ లో నాలుగు బ్యాక్ కెమెరాలను అందించింది, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ కెమెరా ఎపర్చరు f1.7. సెకండ్ లెన్స్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో 4జి, వై-ఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, టైప్ సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
మోటో జి10పవర్ స్పెసిఫికేషన్లుమోటో జి10పవర్‌లో స్టాక్ ఆండ్రాయిడ్ ఉంది. 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వస్తుంది. వీటిని మెమరీ కార్డ్ సహాయంతో 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా గురించి చెప్పాలంటే దీనికి నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f1.7. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మోటో జి10 పవర్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉంది.

Latest Videos

click me!