ప్రత్యేకత ఏంటంటే గార్మిన్ లిల్లీ స్మార్ట్ వాచ్‌లో గర్భధారణ ట్రాకింగ్, మెస్టృయేషన్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ అందించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో లైవ్‌ట్రాక్ స్పెషల్ ఫీచర్ కూడా ఉంది, దీని సహాయంతో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ లొకేషన్ ని ట్రాక్ చేయగలుగుతారు.
undefined
గార్మిన్ లిల్లీ ధరగార్మిన్ లిల్లీ ఇటాలియన్ లెథర్, స్టెయిన్లెస్ స్టీల్ బెజెల్స్‌తో కూడిన క్లాసిక్ వేరియంట్‌తో పాటు మొత్తం రెండు వేరియంట్‌లలో భారతదేశంలో లాంచ్ చేశారు. మరో వేరియంట్ సిలికాన్ బ్యాండ్, అల్యూమినియం బెజెల్స్‌తో గార్మిన్ లిల్లీ స్పోర్ట్ వస్తుంది.
undefined
గార్మిన్ లిల్లీ క్లాసిక్ ధర రూ .25,990, గార్మిన్ లిల్లీ స్పోర్ట్ ధర రూ .20,990. రెండు మోడళ్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, మైంట్రా, పేటీఎం స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటాయి.
undefined
గార్మిన్ లిల్లీ స్పెసిఫికేషన్లుగార్మిన్ లిల్లీ స్మార్ట్ వాచ్ లో 1-అంగుళాల టిఎఫ్‌టి ఎల్‌సిడి గ్రేస్కేల్ డిస్‌ప్లేతో 240x201 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. వాచ్ బాడీ ఫైబర్ రీఇన్ ఫోర్సెడ్ పాలిమర్ తో తయారు చేయబడింది. వాచ్ బరువు 24 గ్రాములు.
undefined
దీని బ్యాటరీకి సంబంధించి 5 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాచ్ లో ఆక్సిజన్ స్లీప్ ట్రాకింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది కాకుండా వాటర్, డస్ట్‌ప్రూఫ్ కోసం 5ఏటిఎం రేటింగ్ పొందింది.
undefined
హెల్త్ మానిటర్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, రెస్టింగ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్ట్రెస్ ట్రాకింగ్, ప్రెగ్నెన్సీ ట్రాకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. గర్భధారణ ట్రాకింగ్ ఫీచర్ శిశువు కదలిక, రక్తంలో గ్లూకోజ్ సమాచారాన్ని అందిస్తుంది. సూచిస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లు ఈ స్మార్ట్‌వాచ్‌లో లభిస్తాయి.
undefined