iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే

Published : Sep 10, 2026, 12:00 PM IST

Apple iPhone Duo: ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయోను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రూ. 2,99,000 ప్రారంభ ధరతో ఐఫోన్ డ్యూయోను లాంచ్ చేసింది. శాంసంగ్ కు షాకిస్తూ కిల్లింగ్ ఫీచర్లతో వచ్చిన ఆపిల్ తొలి మడత ఫోన్ పూర్తి వివరాలు మీకోసం.

PREV
16
మార్కెట్‌లోకి ఆపిల్ మడత ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు

ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్. టెక్ దిగ్గజం ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ (iPhone Duo)ను అధికారికంగా మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మార్కెట్‌లోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత యాపిల్ ఈ ప్రయోగానికి తెరలేపింది. ఆపిల్ తన వార్షిక ఈవెంట్‌లో ఐఫోన్ డ్యూయోతో పాటు ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఎయిర్‌పాడ్స్ 5, నయా యాపిల్ వాచ్ మోడళ్లను అన్‌వీల్ చేసింది. భారత మార్కెట్‌లో ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర రూ. 2,99,000గా కంపెనీ నిర్ణయించింది.

26
ఐఫోన్ డ్యూయో డిజైన్, డిస్‌ప్లే ప్రత్యేకతలు

ఆపిల్ చరిత్రలోనే ఇది అత్యంత సన్నని ఐఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు పాస్‌పోర్ట్ సైజులో 5.4 అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుంది. పూర్తిగా తెరిచాక 7.6 అంగుళాల భారీ స్క్రీన్‌గా మారుతుంది. ఇది ఐఫోన్ 18 ప్రో మాక్స్ కంటే 50 శాతం పెద్దది. కెమెరా విభాగంలో వెనుక వైపు రెండు 48-మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. ఒకటి 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, రెండోది 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా. లోపలి వైపు, కవర్ స్క్రీన్ పైన ప్రత్యేక కెమెరాలు ఉన్నాయి. 12MP సెంటర్ స్టేజ్ కెమెరా ఇచ్చారు. మెగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.

36
ఐఫోన్ డ్యూయో సూపర్ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్

ఐఫోన్ డ్యూయో సింగిల్ ఛార్జ్‌పై రోజంతా పనిచేసే ఆల్ డే బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని ఆపిల్ వెల్లడించింది. ఔటర్ స్క్రీన్ వాడితే 44 గంటలు, ఇన్నర్ స్క్రీన్ వాడితే 31 గంటల వీడియో ప్లేబ్యాక్ వస్తుంది. రెండు స్క్రీన్‌లు కలిపి వాడితే 22 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 5 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ చూసేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను డిజైన్ చేశారు. ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ ఇవ్వడం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్‌ కు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

46
ఐఫోన్ డ్యూయో సేల్, స్టోరేజ్ వివరాలు ఇవే

ఐఫోన్ డ్యూయో కోసం అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 23 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఇది ఐఫోన్ 18 ప్రో మోడళ్ల కంటే ఒక నెల ఆలస్యంగా సేల్‌కు రానుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 256 GB, 512 GB, 1 TB, 2 TB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం TSMC 2nm ప్రాసెస్‌పై తయారైన యాపిల్ లేటెస్ట్ A20 ప్రో చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగించారు. ఇదే ప్రాసెసర్‌ను ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలోనూ అందించారు.

56
సీఈవో జాన్ టెర్నస్ ఏమన్నారంటే?

స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌ను యాపిల్ కొత్త సీఈవో జాన్ టెర్నస్ నేతృత్వంలో నిర్వహించారు. మాజీ సీఈవో టిమ్ కుక్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈవెంట్‌లో టెర్నస్ తన జీన్స్ వెనుక జేబులోంచి ఐఫోన్ డ్యూయోను తీసి మార్కెట్‌కు పరిచయం చేశారు. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల అనుభవాన్ని ఐఫోన్ డ్యూయో పూర్తిగా రీడిఫైన్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

66
ఐఫోన్ 18 సిరీస్, ఇతర ప్రొడక్ట్స్ ఇవే

ఈ ఈవెంట్‌లో యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో ఐఫోన్ 18 ప్రో, ప్రో మాక్స్‌లను కూడా లాంచ్ చేశారు. ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900 కాగా, ప్రో మాక్స్ ధర రూ. 1,79,900గా ఉంది. దీంతో పాటు సిరి ఏఐ సపోర్ట్‌తో పవర్ ఫుల్ ఎయిర్‌పాడ్స్ 5 ని తీసుకొచ్చారు. అలాగే కొత్త హెల్త్ సెన్సార్లు, ఏఐ ఫీచర్లతో కూడిన యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ ఆల్ట్రా 4 లను యాపిల్ విడుదల చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories