సామ్‌సంగ్ గెలాక్సీ S26 FE 5G (8GB RAM + 256GB స్టోరేజ్, పిస్తా కలర్) మోడల్ అసలు ధర (MRP) రూ.1,09,999. కానీ, ప్రస్తుతం అమెజాన్ లో ఇది రూ.66,999 కే అందుబాటులో ఉంది. ఎలాంటి ఇతర ఆఫర్లు లేకుండానే డైరెక్ట్ గా 39% డిస్కౌంట్ అంటే.. సుమారు రూ.43,000 ఆదా చేసుకోవచ్చు.
దీనితో పాటు అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్ వాడితే ధర మరింత తగ్గుతుంది. ఉదాహరణకు, రెండేళ్ల క్రితం నాటి సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.19,800 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ S26 FE ఫోన్ ధర రూ.47,199కి పడిపోతుంది. ఇతర పాత ఫోన్లకు కూడా ఇలాంటి మంచి ఎక్స్చేంజ్ వాల్యూనే వస్తుంది.
'అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్' క్రెడిట్ కార్డు వాడేవారికి అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు 5%, నాన్-ప్రైమ్ మెంబర్స్ కు 3% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అయితే ఈఎంఐ ఆర్డర్స్, అమెజాన్ బిజినెస్ లావాదేవీలకు ఇది వర్తించదు.
ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే ఈ ఫోన్ ను ఫైనల్ గా రూ.45,000 నుంచి రూ.50,000 లోపే కొనొచ్చు. మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ ను బట్టి డిస్కౌంట్ మారుతుంది. బాగా పనిచేసే ఫోన్ కు మంచి వాల్యూ దక్కుతుంది.