ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, పల్స్ ఆక్సీమీటర్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాంబియంట్ లైట్ సెన్సార్, లీనియర్ హాప్టిక్ మోటార్ వంటి సెన్సార్లను ఇందులో అమర్చారు. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ కోసం ఎన్ఎఫ్సీ (NFC), రిమోట్ కెమెరా షట్టర్ కంట్రోల్, షార్ట్‌కట్ జెస్చర్స్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 8.0 లేదా ఐఓఎస్ 14.0 ఆపై వెర్షన్లలో 'Mi Fitness' యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 233mAh బ్యాటరీ ఇచ్చారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 90 నిమిషాలు పడుతుంది. లైట్ యూసేజ్‌లో 21 రోజులు, నార్మల్ యూసేజ్‌లో 10 రోజులు, ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే (AOD) ఆన్‌లో ఉంటే 6 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని షియోమీ పేర్కొంది.