శామ్‌సంగ్ అత్యంత పవర్ ఫుల్ 5జి స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఎం సిరీస్‌ కింద లాంచ్..

First Published | Sep 28, 2021, 7:19 PM IST

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ మిడ్‌రేంజ్ 5జి స్మార్ట్‌ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జిని భారత మార్కెట్లో విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి ఇటీవల పోలాండ్‌లో ప్రవేశపెట్టారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి అనేది కంపెనీ ఎం సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. 

 దీనిలో స్నాప్‌డ్రాగన్ 778జి ప్రాసెసర్‌ ఉంది, దీనిని 6ఎన్‌ఎం ప్రాసెస్‌పై తయారు చేసారు. అలాగే 5జి 11 బ్యాండ్‌ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఇచ్చారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ ఆమోలెడ్  ప్లస్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇంకా ఈ ఫోన్ కి 25W ఛార్జింగ్‌ సపోర్ట్ , 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి ధర

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి 6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ ధర రూ .29,999 కాగా, 8 జి‌బి ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ ధర రూ .31,999. ఈ స్మార్ట్ ఫోన్ ని అమెజాన్, శామ్‌సంగ్ ఆన్‌లైన్ స్టోర్ నుండి అలాగే అన్ని రిటైల్ స్టోర్స్ నుండి అక్టోబర్ 3 నుండి విక్రయించనున్నారు. లాంచింగ్ ఆఫర్ కింద  6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ను రూ .26,999, 8 జి‌బి ర్యామ్ తో 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ను రూ .28,999 లకు కొనుగోలు చేయవచ్చు, అయితే ఈ ధర అమెజాన్ సేల్ వరకు మాత్రమే ఉంటుంది. ఫోన్‌ను ఐసి బ్లూ, బ్లేజింగ్ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.


శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి స్పెసిఫికేషన్‌లు

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జిలో  అండ్రాయిడ్ ఆధారిత వన్ యూ‌ఐ ఉంది.  అంతేకాకుండా 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,  ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ అందించారు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి కెమెరా

ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్  ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జి  బ్యాటరీ

కనెక్టివిటీ కోసం ఈ శామ్‌సంగ్ ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టి‌ఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5, జి‌పి‌ఎస్/ఏ-జి‌పి‌ఎస్, ఎన్‌ఎఫ్‌సి, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ లభిస్తుంది. 25W ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ఉంది.

Latest Videos

click me!