అన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు ఒకే విధమైన ఛార్జర్.. త్వరలో కొత్త నియమాలు అమలులోకి..

First Published | Sep 28, 2021, 2:53 PM IST

 ఒకప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేదా మొబైల్స్  చార్జింగ్ కోసం మందంగా గుండ్రటి  పిన్ ఛార్జర్ ఉండేది. ఆ తరువాత రోజులో అన్ని కంపెనీల విభిన్న ఛార్జర్‌లను  తీసుకొచ్చాయి. అయితే నోకియా కంపెనీ నోకియా ఫోన్‌ల కోసం సన్నని పిన్ ఛార్జర్ ప్రవేశపెట్టింది అప్పట్లో దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించారు దీంతో మంచి ప్రజాదరణ పొందింది.

ఇప్పుడు  మార్కెట్‌లో మైక్రో యూ‌ఎస్‌బి, టైప్-సి, టైప్-బి, టైప్-ఎ వంటి ఛార్జర్‌లు అందుబాటులో ఉన్నాయి, అయితే టైప్-సి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా వరకు ల్యాప్‌టాప్‌లు కూడా టైప్-సి పోర్ట్‌తో రావడం ప్రారంభించాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక వార్తా  వెలుగులోకి వచ్చింది.

యూరోపియన్ యూనియన్ (ఈ‌యూ) యూనివర్సల్ ఛార్జర్‌ల కోసం ఒక నియమాన్ని రూపొందించింది. త్వరలో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌ల కోసం యూనివర్సల్ ఛార్జర్ నియమాన్ని ప్రవేశపెట్టనున్నట్లు యూరోపియన్ యూనియన్ చెబుతోంది, అంటే అన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ప్రత్యేక ఛార్జర్‌లను అందించాల్సిన అవసరం ఉండదు.


సింగిల్ యూనివర్సల్ ఛార్జర్ ఉండటం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు ఉంటుంది, కానీ యూరోపియన్ యూనియన్  నిర్ణయంపై ఆపిల్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. యూనివర్సల్ ఛార్జర్ వచ్చిన తర్వాత కొత్త ఆవిష్కరణలకు  ఎండ్ పడుతుందని, కాలుష్యం కూడా పెరుగుతుందని ఆపిల్ తెలిపింది, అయితే దీని వెనుక ఉన్న కారణం ఆపిల్ చెప్పలేదు. యూరోపియన్ యూనియన్‌లో 450 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.

ఆపిల్  ఐప్యాడ్, ఐఫోన్‌లో చాలా కాలంగా లైటెనింగ్ టైప్ ఛార్జర్‌లను ఉపయోగిస్తోంది. యూరోపియన్ యూనియన్ టైప్-సి ఛార్జర్‌ను యూనివర్సల్ ఛార్జర్‌గా తయారు చేయడాన్ని పరిశీలిస్తోంది. ఇలాంటి సమయంలో ఆపిల్ కి ఒక పెద్ద సమస్య ఎదురుకానుంది. యూరోపియన్ యూనియన్  నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సమస్యలను కలిగిస్తుందని ఆపిల్ చెప్పింది. యూరోపియన్ యూనియన్‌లో ఇలాంటి డిమాండ్ గత ఏడాది జనవరిలో కూడా లేవనేత్తారు.

Latest Videos

click me!