ఐఫోన్ 13తో కొత్త చిక్కులు.. ? ఒరిజినల్ డిస్‌ప్లే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా..

First Published | Sep 28, 2021, 5:52 PM IST

 అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ ఆపిల్ కొద్దిరోజుల క్రితం ఐఫోన్ 13 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఐఫోన్ 13 ఫోన్ రిపేర్ ఖర్చు కూడా కాస్త ఖరీదైనదే. కొన్ని కారణాల వల్ల మీ ఐఫోన్ 13 పాడైపోయిందని అనుకోండి దీనిని ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ తో రిపేర్ చేశాక కూడా కూడా ఫోన్ పనిచేయకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి..
 

ఐఫోన్ 13 విషయంలో కూడా అలాంటిదే ఎదురైంది. ఐఫోన్ 13కి ఒరిజినల్ డిస్‌ప్లేను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కూడా ఫేస్ ఐడితో సమస్య ఎదురైందంటే ఇంకా థర్డ్ పార్టీ డిస్‌ప్లే గురించి మాట్లాడటం కూడా ఉపయోగం ఉండదు. మాక్రోమర్స్ నివేదిక (MacRumors.com, LLC)ప్రకారం, ఐఫోన్ 13  ఒరిజినల్ డిస్‌ప్లేను మరొక ఐఫోన్ 13తో భర్తీ చేస్తే ఫేస్ ఐడితో సమస్య ఎదురైంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది.

ఆపిల్ ఇప్పటికే థర్డ్ పార్టీ రిపేరింగ్ నుండి విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఈ సంవత్సరం ఐఫోన్ 13తో ఒక కొత్త వివాదం వచ్చి పడింది, అయితే దీని వల్ల కస్టమర్లకు చెడు అనుభవం ఎదురు కావొచ్చు, ఎందుకంటే ఎవరైనా ఐఫోన్ 13 వినియోగదారుడు స్క్రీన్‌ను రీప్లేస్ చేసినప్పటికీ  ఫేస్ ఐడితో  సమస్య పడాల్సి ఉంటుంది. ఇందుకు ఏదైనా థర్డ్ పార్టీ రిపేర్ స్టోర్‌కు బదులుగా ఆపిల్ ఆథరైజేడ్ స్టోర్‌లో ఫోన్ రిపేర్ చేయవలసి ఉంటుంది.
 


ఐఫోన్ 13 సిరీస్ సేల్స్ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ కింద నాలుగు వేరియంట్లను ప్రవేశపెట్టరు. ఐఫోన్ 13 మినీ 128 జి‌బి వేరియంట్ ధర రూ. 69,900, 256 జి‌బి వేరియంట్ ధర రూ .79,900, 512 జి‌బి వేరియంట్ ధర రూ .99,900. ఐఫోన్ 13 128 జి‌బి వేరియంట్ ధర రూ. 79,900, 256 జి‌బి వేరియంట్ ధర రూ .89,900, 512 జి‌బి వేరియంట్ ధర రూ .1,09,900.

ఐఫోన్ 13 ప్రో 128 జి‌బి వేరియంట్ ధర రూ .1,19,900, 256 జి‌బి వేరియంట్ ధర రూ .1,29,900, 512 జి‌బి వేరియంట్ ధర రూ .1,49,900, 1 టి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,69,900. ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ 128 జి‌బి వేరియంట్ ధర రూ .1,29,900, 256 జి‌బి వేరియంట్ ధర రూ .1,39,900, 512 జి‌బి వేరియంట్ ధర రూ .1,59,900, 1 టి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ .1,79,900. అయితే ఆపిల్ తయారు చేసిన అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ 13.
 

Latest Videos

click me!