వరల్డ్ ఫోటోగ్రఫీడే : ఈ 5 స్మార్ట్‌ఫోన్లు మొబైల్ ఫోటోగ్రఫీ లవర్స్ కోసం తయారుచేశారు.. అవేంటో తెలుసా..?

First Published | Aug 19, 2021, 12:50 PM IST

 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 19 ఆగస్టు 1839న ప్రారంభమైంది. దీనిని ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిని డాగ్‌రోరెటైప్ అని పిలువబడే లగ్ డాగ్యురే అభివృద్ధి చేసిన ఫోటోగ్రాఫిక్ ప్రక్రియతో ప్రారంభమైంది. 

స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచం ప్రారంభమైనప్పటి నుండి ఫోటోగ్రఫీ స్టయిల్ కూడా మారింది. ఈ రోజుల్లో డి‌ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ కెమెరాలు పోటీ పడుతున్నాయి. ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువ కెమెరా ఫీచర్‌లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లో విడుదల అవుతున్నయి. కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు 64 మెగాపిక్సెల్ కెమెరాతో మరికొన్ని 108 మెగాపిక్సెల్ లెన్స్‌తో లాంచ్ అయ్యాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ కోసం కొన్ని ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌లు 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 అల్ట్రా 5జి

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రాలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ, 6.8-అంగుళాల ఎడ్జ్ QHD + డైనమిక్ AMOLED ఇన్ఫినిటీ O డిస్‌ప్లే, 1440x3200 పిక్సెల్స్ రిజల్యూషన్‌, డిస్‌ప్లేతో HDR10+ కి సపోర్ట్, రిఫ్రెష్ రేటు 120Hz. ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా  ఇచ్చారు దీని ప్రైమరీ లెన్స్ 108 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ పిక్సెల్స్, 3వ లెన్స్ 10 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్. కెమెరాతో లేజర్ ఆటో ఫోకస్,  ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 40 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సూపర్ జూమ్, 8కె రికార్డింగ్ వంటి ఫీచర్లు కెమెరాతో అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్‌లో 100x స్పేస్ జూమ్  ఉంది.

Latest Videos


వివో ఎక్స్60 ప్రో

ఫోన్‌లో 6.56-అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే 1080x2376 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 12జి‌బి వరకు LPDDR4X ర్యామ్, 256 జి‌బి వరకు స్టోరేజ్, కెమెరా విషయానికొస్తే మూడు కెమెరాలతో నాలుగు బ్యాక్ కెమెరాలు ఇందులో మొదటి లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 సెన్సార్ గింబల్ స్టాబిలైజేషన్ మరోవైపు రెండవ లెన్స్ f/2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ f/2.46 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్‌లు. ముందు భాగంలో f/2.45 ఎపర్చరుతో 32 మెగాపిక్సెల్ సెల్ఫి కెమెరా ఉంది. ఈ ఫోన్ కెమెరా జీస్ బ్రాండింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కోసం వివో జీస్‌తో భాగస్వామ్యం  చేసుకుంది. లైవ్ ఫోటో, ఏ‌ఆర్ స్టిక్కర్, సూపర్ మూన్, ఆస్ట్రో, ప్రో స్పోర్ట్స్, లాంగ్ ఎక్స్‌పోజర్ వంటి ఫీచర్లు కెమెరాతో  వస్తాయి . 
 

ఎం‌ఐ 11 అల్ట్రా

ఫోన్ కెమెరా గురించి మాట్లాడుతూ ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.95 మరోవైపు, రెండవ లెన్స్ 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఎపర్చరు f/2.2, 128 డిగ్రీల వ్యూ, మూడవ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ దీనితో 120x డిజిటల్ జూమ్, సెల్ఫీ కోసం ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా  అలాగే 120X జూమ్‌తో ఇండియాలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది.ఎం‌ఐ 11 అల్ట్రాతో మీరు 4కె HDR10+ లేదా 8K HDR10 వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
 

వన్‌ప్లస్ 9 ప్రో

దీనిలో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ  లెన్స్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX789 సెన్సార్ ఎపర్చరు f/1.8, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ , ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండూ లెన్స్‌తో అందుబాటులో ఉంటాయి. రెండవ లెన్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్,  మూడవ లెన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో, నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ f/2.4 అపెర్చర్  ఉంది ఇంకా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా పొందుతుంది.

ఐఫోన్ 12 ప్రో మాక్స్

ఐఫోన్ 12 ప్రో మాక్స్ 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఒక లెన్స్ వైడ్ యాంగిల్ (f/1.6), మరొకటి అల్ట్రా వైడ్ (f/2.4)  మూడవ టెలిఫోటో (ప్రోలో f/2.0, ప్రోలో f/2.2 గరిష్టంగా  ముఖ్యంగా తక్కువ కాంతి నైట్ ఫోటోగ్రఫీ కోసం. ఐఫోన్ 12 ప్రో 4x ఆప్టికల్ జూమ్ అండ్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ 5x ఆప్టికల్ జూమ్ పొందుతాయి. అన్ని ఐఫోన్లలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

click me!