బ్లాక్ బుస్టర్ కెమెరాతో సామ్‌సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధర, హై పర్ఫర్మేన్స్ తో జూలై 6న లాంచ్..

First Published | Jul 1, 2021, 2:07 PM IST

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్  ఎం సిరీస్ కింద కొత్త స్మార్ట్ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 గురించి ఒక లీక్ రిపోర్ట్ కొద్దిరోజుల క్రితం వెల్లడైంది. ఇందులో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 జూలై మొదటి వారంలో భారతదేశంలో లాంచ్ కాబోతుందని సూచించింది. అయితే తాజాగా  సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 లాంచ్ గురించి అధికారికంగా తెలిపింది. 

జూలై 6న గెలాక్సీ ఎం22 భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని, దీనిని ఫ్లిప్‌కార్ట్ నుంచి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఫోన్ టీజర్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్షమైంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించినప్పటికీ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని కూడా కొందరు చెబుతున్నారు.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్22 6.4-అంగుళాల సూపర్ అమోలెడ్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అంతేకాకుండా ఈ శామ్‌సంగ్ ఫోన్‌కు నాలుగు బ్యాక్ కెమెరాలు లభిస్తాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్‌లు ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ సిరీస్ కింద లాంచ్ అవుతున్న నాల్గవ ఫోన్ ఇది.

ఇంతకుముందు గెలాక్సీ ఎఫ్62, గెలాక్సీ ఎఫ్ 12, గెలాక్సీ ఎఫ్02లు వంటి స్మార్ట్‌ఫోన్‌లను ఈ సిరీస్ కింద లాంచ్ చేశారు. తక్కువ ధరతో మెరుగైన పనితీరు కోసం చూస్తున్నవారి కోసం ఈ కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు శామ్‌సంగ్ తెలిపింది.
ఈ కొత్త శామ్‌సంగ్ ఫోన్ 25w ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్నట్లు సర్టిఫైడ్ సైట్‌లో చూడవచ్చు, కాని ఫోన్ బాక్స్ నుండి మీకు 15W ఛార్జర్ లభిస్తుంది. ఎందుకంటే 25W ఫాస్ట్ ఛార్జింగ్ చాలా శామ్‌సంగ్ ఫోన్‌లతో లభిస్తుంది కాని బాక్స్‌లో 15W ఛార్జర్ మాత్రమే అందుబాటులో ఉంది.
యు.ఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) జాబితా ప్రకారం, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం22 బ్లూటూత్ వి5.0తో రాబోతుంది. అంతేకాకుండా ఎన్‌ఎఫ్‌సి, వై-ఫై 802.11ac కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు 4జీ ఎల్‌టీఈతో డ్యూయల్ సిమ్ సపోర్ట్ లభిస్తుంది.

Latest Videos

click me!