అయితే డేటాను లీక్ చేసిన హ్యాకర్ల గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. లింక్డ్ఇన్ ఈ డేటా లీక్లో ఫోన్ నంబర్లు, అడ్రస్, లొకేషన్స్, వినియోగదారుల జీతాలు వంటి వ్యక్తిగత సమాచారం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన 500 మిలియన్ల వినియోగదారుల డేటా లీక్ గురించి కూడా లింక్డ్‌ఇన్ స్వయంగా ధృవీకరించింది. ఆ లీక్‌లో కూడా ఇ-మెయిల్ అడ్రస్ నుండి మొబైల్ నంబర్ వరకు పూర్తి పేరు, అక్కౌంట్ ఐడి, సోషల్ మీడియా అక్కౌంట్ సమాచారం, ఆఫీస్ సమాచారం లీక్ అయ్యాయి. ఈ డేటా లీక్ ఆన్‌లైన్ హ్యాకర్ల ఫోరమ్‌లో జాబితా చేశారు.
undefined
ఈ డేటా లీక్‌పై లింక్డిన్ వెంటనే స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో మా యూజర్ల ఎటువంటి డేటా లీక్ కాలేదని తెలిపింది. నెట్‌వర్క్‌ను స్క్రాప్ చేయడం ద్వారా ఈ డేటా సంగ్రహించబడింది, అయినప్పటికీ లింక్డ్ఇన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పింది. ప్రాథమిక దర్యాప్తు తరువాత లింక్డ్ఇన్ యూజర్ల వ్యక్తిగత డేటా లీక్ కాలేదని తెలిపింది. డేటాను స్క్రాప్ చేయడం లింక్డ్ఇన్ గోప్యతా విధానాన్ని ఉల్లంఘీంచినట్లు అని కంపెనీ తెలిపింది.
undefined
తాజా డేటా లీక్‌లో 700 మిలియన్ల వినియోగదారుల సమాచారం డార్క్ వెబ్‌లో అమ్ముకానికి పెట్టారు. డార్క్ వెబ్ పబ్లిక్ డొమైన్ లో ఒక మిలియన్ వినియోగదారుల డేటాను హ్యాకర్లు పోస్ట్ చేశారు. RestorePrivacy ఈ డేటా లీక్ గురించి మొదటి సమాచారం ఇచ్చింది.
undefined
ఈ డేటా లీక్‌కు సంబంధించి 9to5Google కూడా హ్యాకర్లను సంప్రదించింది. లింక్డ్ఇన్ API ద్వారా ఈ డేటాను సేకరించినట్లు హ్యాకర్లు చెప్పారు. లీకైన డేటాలో వినియోగదారుల పాస్‌వర్డ్‌లు చేర్చలేదు. ఇప్పుడు వినియోగదారులందరూ వారి అక్కౌంట్ ని సెక్యూరిటి చెక్ చేయడం అవసరం. అంతేకాకుండా వినియోగదారులు వారి పాస్‌వర్డ్‌ను కూడా రీసెట్ చేసుకోవాలి. టు ఫ్యాక్టర్ అతేంటికేషన్ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి.
undefined