వాట్సాప్ కొత్త అప్‌డేట్: డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలను తెలుసుకోండి..

First Published | Jun 30, 2021, 7:39 PM IST

ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. ఒకోసారి వాట్సాప్  వెర్షన్  లో కొత్త ఫీచర్స్  అని, కొన్నిసార్లు వాట్సాప్  గోల్డ్ వెర్షన్ లాంచ్ అవుతుంది అని పుకార్లు చక్కర్లుకొడుతుంటాయి. వాట్సాప్  కొత్త వెర్షన్ పేరుతో ప్రతిసారీ చాలా రకాల ఫీచర్లు తీసుకొస్తుందనే వార్తలు వినిపిస్తుంటాయి.  

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీటన్నిటిని వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేయలేదు. తాజాగా వాట్సాప్ కొత్త వెర్షన్ పేరుతో ఒక యాప్ వైరల్ అవుతోంది ఈ యాప్ పేరు జిబి వాట్సాప్. ఈ యాప్ లో మెసేజ్ ఆన్ సెండ్ నుండి ఆటో రిప్లయి వరకు చాలా ఫీచర్స్ ఉన్నాయి, అయితే ఈ యాప్ మీకు సురక్షిమేన, దీనిని అధికారికంగా వాట్సాప్ లాంచ్ చేసిందా.. ? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి...
undefined
జిబి వాట్సాప్ యాప్ అంటే ఏమిటి?ముఖ్యమైన విషయం ఏంటంటే జిబి వాట్సాప్ ను థర్డ్ పార్టీ సంస్థ లాంచ్ చేసింది. ఈ యాప్ పూర్తిగా వాట్సాప్ పోలి ఉంటుంది కాని దీనిని వాట్సాప్ అధికారికంగా లాంచ్ చేయలేదు. జి‌బి వాట్సాప్ సాధారణంగా చాలా వెబ్‌సైట్లలో ఏ‌పి‌కే ఫైల్ రూపంలో ఉంటుంది.
undefined

Latest Videos


జిబి వాట్సాప్ టాప్ ఫీచర్స్1.ఆటో రిప్లయి2.డి‌ఎన్‌డి3.మెసేజెస్ ఫిల్టర్ 4.యాంటీ-రివొక్ మెసేజ్5.షేర్ లైవ్ లొకేషన్స్6.రివొక్ మల్టీపుల్ మెసేజెస్7.సెండ్ పిక్చర్స్ : ఒకేసారి 90కి పైగా ఫోటోలు పంపవచ్చు8.స్టేటస్ డౌన్‌లోడ్9.అమేజింగ్ ఫాంట్10.మార్క్ ఆన్ రీడ్ మెసేజెస్11.స్టేటస్ హైడ్
undefined
మీరు ఈ యాప్ ని గూగుల్ బ్రౌసర్ లో థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో కనుగొంటారు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ ఫోన్ భద్రతా కారణాల వల్ల దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి నిరాకరిస్తుంది, అయిన కానీ మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మీరు ఫోన్ సెట్టింగులను మార్చాలి. దీని రిజిస్ట్రేషన్ కూడా నిజమైన వాట్సాప్ లాగానే ఉంటుంది.
undefined
ఈ యాప్ భద్రతకు సంబంధించినంతవరకు గూగుల్ ఈ ఏ‌పి‌కే ఫైల్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ ని సురక్షితమైనదిగా పరిగణించదు. దీని బట్టి జిబి వాట్సాప్ కూడా సురక్షితం కాదు. కానీ నిజమైన వాట్సాప్ యాప్ లో లేని చాలా ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
undefined
click me!