మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి లాంచ్.. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ?

First Published Jan 26, 2021, 6:05 PM IST

 దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, మేడ్ ఇన్ ఇండియా గేమ్ ఫవ్-జి ప్లే-స్టోర్‌లో ప్రత్యక్షమైంది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఎన్-కోర్ గేమ్స్ ఫవ్-జి గేమ్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికి, ఫవ్-జిని  ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫవ్-జి గేమ్ పూర్తి పేరు ఫియర్ లెస్  అండ్ యునైటెడ్ గార్డ్స్. పబ్-జి మొబైల్ గేమ్ కి పోటీగా లాంచ్ చేసిన మేడ్ ఇన్ ఇండియా గేమ్  ఫవ్-జి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ...

గూగుల్ ప్లే-స్టోర్‌లో ఫవ్-జి గేమ్ ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఫవ్-జి గేమ్ లోగో మార్చబడింది. గేమ్ సైజ్ 438ఎం‌బి. లాంచ్ చేసిన కొద్ది సేపటికే సుమారు వందల మంది ఈ గేమ్ ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫవ్-జి గేమ్ గూగుల్ ప్లే-స్టోర్‌లో 4.5 గా రేట్ చేయబడింది. 55,784 మంది ప్లే-స్టోర్‌లో గేమ్ గురించి రీవ్యూస్ రాశారు. ఆండ్రాయిడ్ 8 లేదా అంతకంటే ఎక్కువ అప్ డేట్ ఉన్న ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోన్‌లకు ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
undefined
గూగుల్ ప్లే-స్టోర్‌ ఫవ్-జి గేమ్‌ సమాచారంలో గాల్వన్ వ్యాలీ స్క్రీన్ షాట్ కూడా అప్‌లోడ్ చేయబడింది. భవిష్యత్తులో గేమ్ థీమ్ మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఈ గేమ్ గాల్వన్ వ్యాలీలో జరిగిన భారత్-చైనా మధ్య ఘటనపై ఆధారపడి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గేమ్ మొదటి మిషన్ పేరు గాల్వన్ మిషన్.
undefined
గేమ్ లో సిల్వర్ కాయిన్స్ వంటి రివార్డులు కూడా లభిస్తాయి. గేమ్ పంచ్ లైన్ మనుగడ కోసం పోరాటం. ఆయుధాలు, బాక్సులు, ఇతర వంటి వంటివి గేమ్ లో ఆయుధంగా లభిస్తాయి.
undefined
నవంబర్ 30న గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌కు సంబంధించి ప్రీ-రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ గేమ్ ను ఇండియన్ గేమ్ డెవలపర్ సంస్థ ఎన్-కోర్ గేమ్స్ తయారు చేసి అభివృద్ది చేసింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% వీర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్తుంది.
undefined
click me!