రెడ్‌మి నోట్ 10టి 5జి 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర ఇప్పుడు రూ .14,999. 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ .16,999కి పెరిగింది, ఇంతకు ముందు రూ .16,499గా ఉంది. రెడ్‌మి నోట్ 10టి 5జి 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజ్, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్, గ్రాఫిక్స్ కోసం మాలి- G57 జిపియూ ఇచ్చారు. రెడ్‌మి నోట్ 10టి 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్. కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్, 5జి, 4జి, ఎన్‌ఎఫ్‌సి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి5.1, జిపిఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బి టైప్-సి పోర్ట్, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సప్పోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో 22.5W ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.