Jio Plans జియో రూ.199 vs రూ.198 ప్లాన్స్: రూ.1 తేడాతో బెనిఫిట్స్ బోలెడు!
రిలయన్స్ జియోలో రూ.200 లోపు రెండు ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో తేడా కేవలం ఒక్క రూపాయే. కానీ పొందే ప్రయోజనాలు బోలెడు. మీ అవసరాలకు ఏ ప్లాన్ ఉపయోగ పడుతుందో తెలుసుకోండి.
రిలయన్స్ జియోలో రూ.200 లోపు రెండు ప్లాన్స్ ఉన్నాయి. వాటిలో తేడా కేవలం ఒక్క రూపాయే. కానీ పొందే ప్రయోజనాలు బోలెడు. మీ అవసరాలకు ఏ ప్లాన్ ఉపయోగ పడుతుందో తెలుసుకోండి.
మీరు జియో టెలికాం యూజర్ అయితే మీకోసం రూ.200లోపు రెండురకాల రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.200 లోపు 20 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ కోసం చూస్తుంటే, ఏది రీఛార్జ్ చేసుకోవడానికి మంచిదో తెలుసుకోండి. ఇక్కడ రూ.200 లోపు రెండు ప్లాన్స్ ఉన్నాయి. రెండిటికీ రూపాయి తేడానే ఉంది. కానీ బెనిఫిట్స్ వేర్వేరు.
ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే యూజర్ల కోసం జియో ₹199 ప్లాన్ ఉంది. ఇందులో రోజుకి 1.5 GB డేటా ఇస్తారు. ఈ ప్లాన్‌లో మొత్తం 27 GB డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 18 రోజులు. అన్‌లిమిటెడ్ 5G డేటా, రోజుకి 100 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ కూడా ఉన్నాయి.
ఎక్కువ డేటా వాడేవాళ్ల కోసం ఈ జియో ప్లాన్. ఇందులో రోజుకి 2 GB డేటా ఇస్తారు. ఈ ప్లాన్‌లో మొత్తం 28 GB డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 14 రోజులు. అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంది. జియో నెట్‌వర్క్ ఉన్న ఏరియాల్లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకి 100 SMSలు కూడా ఇస్తారు. ఈ రెండు ప్లాన్స్‌లో జియోటీవీ, జియోక్లౌడ్ ఫ్రీగా వస్తాయి.
జియో ₹198, ₹199 ప్లాన్స్‌లో ఏది బెటరో చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక ప్లాన్‌లో డేటా బెనిఫిట్ ఉంటే, ఇంకో ప్లాన్‌లో వ్యాలిడిటీ బెనిఫిట్ ఉంది.
కానీ ఈ రెండిట్లో జియో ₹199 ప్లాన్ బెటర్. ఎందుకంటే రూపాయి ఎక్కువ పెడితే ఎక్కువ వ్యాలిడిటీ వస్తుంది. ₹198 ప్లాన్ కంటే ₹199 ప్లాన్‌లో 4 రోజులు ఎక్కువ వ్యాలిడిటీ ఉంది.
డేటా గురించి మాట్లాడితే, ₹199 ప్లాన్ కంటే ₹198 ప్లాన్‌లో 1 GB ఎక్కువ డేటా వస్తుంది. రెండిట్లో ఇచ్చే బెనిఫిట్స్ ఒకటే. మీ ఫోన్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే, ₹199 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.