ChatGPT Dominance డీప్‌సీక్ తుస్.. ఆదరణలో చాట్ జీపీటీ వెనకే!

Published : Apr 12, 2025, 09:57 AM IST

చాట్ జీపీటీకి పోటీగా ఎంతో ఆర్భాటంగా మొదలైన డీప్ సీక్ అనుకున్నంతగా జనాలను ఆకట్టుకోలేకపోతోంది. చాట్ జీపీటీతో పోలిస్తే డీప్ సీక్ వినియోగదారులు గడిపే సమయం సగటున సగం మాత్రమే నమోదవుతోంది.

PREV
15
ChatGPT Dominance  డీప్‌సీక్ తుస్..   ఆదరణలో చాట్ జీపీటీ వెనకే!

అతి తక్కువ ఉత్పత్తి వ్యయం, శక్తిమంతమైన టెక్నాలజీతో సంచలనం నెలకొల్పిన డీప్‌సీక్ పనితీరులో మాత్రం చతికిలపడుతోంది. తాజా అధ్యయనం ప్రకారం వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేకపోతోంది. డీప్‌సీక్ మొదట ప్రారంభించినప్పుడు, చాట్‌జీపీటీకి బలమైన ప్రత్యామ్నాయంగా అంతా చెప్పారు. డీప్‌సీక్, మీడియా దృష్టిని, మార్కెట్ ఆసక్తిని ఒకేసారి పొందింది. నిపుణులు దీనిని గొప్ప పురోగతిగా ప్రశంసించారు. ప్రారంభ వినియోగదారు డేటా సైతం ఈ వాదనకు మద్దతు ఇస్తున్నట్లు కనిపించింది. విడుదల తర్వాత మొదటి రెండు నుండి మూడు వారాల వరకు, ఈ యాప్ ఆశాజనకమైన వినియోగదారుల సంఖ్యను మూటగట్టుకుంది.

25

కానీ ప్రారంభ ఉత్సాహం చల్లారిన తర్వాత, గణాంకాలు వేరే కథను చెప్పాయి. పాపిల్ AI మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం గణాంకాల ప్రకారం, డీప్‌సీక్ ఆదరణ కొలమానాలు మూడవ వారం తర్వాత క్షీణించడం ప్రారంభించాయి.

ఈ వేదిక దాని విడుదలలో సృష్టించిన ఆర్భాటాన్ని నిలుపుకోలేకపోయింది. అప్పుడప్పుడు ఆదరణలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇవి ఉత్సాహాన్ని నిలుపుకోవడానికి లేదా చాట్‌జీపీటీతో పోటీ పడలేకపోతోంది.

35

తన స్థానాన్ని నిలబెట్టుకున్న చాట్‌జీపీటీ

వినియోగదారు సెషన్ కొలమానాలను పోల్చి చూస్తే, ​​తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాట్‌జీపీటీ ఒక వినియోగదారుకు ఎక్కువ సంఖ్యలో సెషన్‌లను కలిగి ఉండటమే కాకుండా, వినియోగదారులు దానిలో గణనీయంగా ఎక్కువ సమయం గడిపారు.

చాట్‌జీపీటీ సగటు సెషన్ సమయం డీప్‌సీక్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. డీప్‌సీక్ గరిష్ట కాలంలో కూడా, వినియోగదారుల ఆదరణ పెద్దగా ఉండటం లేదు. కొత్త వినియోగదారులు కూాడా డీప్ సీక్ కి అట్టిపెట్టుకొని ఉండటం లేదు.

45

"ప్రచార ఆర్భాటంతో ఒక ఉత్పత్తిని జనాల మధ్యకు తేలికగా తీసుకెళ్లవచ్చు. ఇది  మార్కెటింగ్ ఎత్తుగడ. కానీ తర్వాత జనం అభిమానం, దాని పనితీరే ఆ ఉత్పత్తిని నిలబెడుతుంది. మార్కెటింగ్ ప్రారంభ ఉత్సాహం కాదు.. దీర్ఘకాలిక పనితీరు ఆధారంగానే దాని భవిష్యత్తు ఉంటుంది" అని పాపిల్ AI వ్యవస్థాపకుడు CEO అంకిత్ ప్రసాద్ అన్నారు.

55

అయితే ఇంతమాత్రాన డీప్ సీక్ ను తేలికగా అంచనా వేయడానికి వీలు లేదు. భవిష్యత్తులో డీప్‌సీక్‌కు కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఈ ఏరియాలో ఎంతో ఎదగడానికి స్కోప్ ఉంది.  కానీ జనం అవసరాలకు అనుగుణంగా  ఉన్నప్పుడే ఆదరణ సాధ్యమవుతుంది అని అంకిత్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories