పోచంపల్లి పట్టణంలో మరింత విస్తారంగా జియో నెట్ వర్క్.. కొత్తగా మరో రెండు టవర్ల ఏర్పాటు..

First Published Nov 27, 2021, 2:18 PM IST

పోచంపల్లి (యాదాద్రి భువనిగిరి జిల్లా) 27 నవంబర్ 2021: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా  పోచంపల్లి పట్టణంలో జియో మొబైల్ నెట్ వర్క్ ను మరింత విస్తరించింది. వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు టవర్లు కొత్తగా పట్టణంలో ఏర్పాటు చేసింది.  
 

ఇంత వరకు పట్టణంలో ఒకే రోజు రెండు టవర్లు ప్రారంభించడం రికార్డు. వీటితో ఇప్పుడు పోచంపల్లి మున్సిపాలిటీ పరిథిలో జియోకు మొత్తం నాలుగు టవర్ల మొబైల్ నెట్వర్క్ సామర్ధ్యం కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఇతర అన్ని టెలికాం కంపెనీల కంటే జియో అత్యధిక టవర్లు కలిగి ఉండటంతో జియో డేటా స్పీడ్ కూడా మరింత మెరుగయ్యింది. 
 

ఆన్ లైన్ క్లాసుల పై ఆధారపడిన కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఇప్పుడు హై- స్పీడ్ జియో  నెట్ వర్క్ తో మరింత ప్రయోజనాన్ని పొందే వీలుంది.

ఆలాగే ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ గ్రామాల్లో ఫోన్ కాల్ చేయాలన్నా సిగ్నల్ లేక నానా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా ఆధార్, బ్యాంకింగ్ వంటి సేవల కోసం సిగ్నల్స్   కోసం ఎత్తైన  ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో కమ్యూనికేషన్ పరంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొవాల్సి ఉండేది. 

అయితే రిలయన్స్ జియో  తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 1529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు ఇప్పుడు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.

click me!