ఆపిల్ ఐఫోన్ లాంటి డిజైన్ తో ఒప్పో రెనో 7 సిరీస్.. ఒకేసారి మూడు 5జి స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్..

First Published | Nov 26, 2021, 4:52 PM IST

 కొన్ని లీక్స్ రిపోర్ట్స్ తర్వాత చివరకు చైనా (china)కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ (electronics)సంస్థ ఒప్పో (oppo)రెనో 7 సిరీస్ లాంచ్ చేసింది. ఒప్పో రెనో 7 5జి, ఒప్పో రెనో 7 ప్రొ 5జి, రెనో 7 ఎస్‌ఈ 5జి అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఒప్పో రెనో 7 సిరీస్ క్రింద ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటికీ పంచ్‌హోల్ డిజైన్‌తో కూడిన ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి(AMOLED) డిస్‌ప్లే ఇచ్చారు. 

ఒప్పో రెనో 7 5జి ఇంకా రెనో 7 ప్రొ 5జి ఫోన్‌లు రెండూ ఐఫోన్  13 సిరీస్ వంటి ఫ్లాట్ ఎడ్జ్‌డ్ డిస్‌ప్లే లభిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే సాధారణంగా ఫోన్‌లో కనిపించే కర్వ్డ్ డిస్‌ప్లే డిజైన్ ఇప్పుడు ఫ్లాట్‌గా మారింది. ఈ మూడు ఫోన్‌ల ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం...

ఒప్పో రెనో 7 5జి, రెనో 7 ప్రొ 5జి ధర
 ఒప్పో రెనో 7 5జి 8జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్ ధర 2,699 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 31,500, అయితే 8జి‌బి ర్యామ్ 256 జి‌బి స్టోరేజ్ ధర 2,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 35,000. ఈ ఫోన్  ఇప్పుడు 12 జి‌బి ర్యామ్  256 జి‌బి స్టోరేజ్‌లో కూడా పరిచయం చేసింది, దీని ధర 3,299 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 38,500. ఒప్పో రెనో 7 ప్రొ 5జి ప్రారంభ ధర 3,699 యువాన్లు అంటే దాదాపు రూ. 43,200. ఒప్పో రెనో 7 ఎస్‌ఈ 5జి ప్రారంభ ధర 2,199 యువాన్లు అంటే దాదాపు రూ. 25,700. ఈ మూడు ఫోన్‌ల గ్లోబల్ లాంచ్‌కు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి వార్తలు లేవు.
 

ఒప్పో రెనో 7 5జి స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 7 5జి ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 12, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్, 12 జి‌బి వరకు LPDDR4x ర్యామ్, 256 జి‌బి వరకు స్టోరేజ్ ఆప్షన్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో  ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ లభిస్తుంది.

రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం  32-మెగాపిక్సెల్ సోనీ IMX709 సెన్సార్ ఇచ్చారు. కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్‌, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 60W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేసే 4500mAh బ్యాటరీని  లభిస్తుంది.


ఒప్పో రెనో 7 ప్రొ 5జి స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 7 ప్రొ 5జిలో  కూడా Android 11 ఆధారిత ColorOS 12, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లే, ఫోన్‌లో MediaTek Dimensity 1200-Max ప్రాసెసర్, 12 GB వరకు LPDDR4x RAM, 256 GB వరకు స్టోరేజ్ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది, దీనిలో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్.

రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ సోనీ IMX709 సెన్సార్‌, కనెక్టివిటీ కోసం 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్‌, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4500mAh బ్యాటరీని అందించారు.

Latest Videos

click me!