అయితే సమస్య పరిష్కారమవుతోంది. చాలా మంది వినియోగదారుల మొబైల్‌లో జియో నెట్‌వర్క్ పునరుద్ధరించడం ప్రారంభమైంది.
సోషల్ మీడియాలో #jiodown ట్రెండ్
కేవలం నిమిషాల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో #jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ ప్రారంభమైంది. వేలాది మంది వినియోగదారులు జియో నెట్‌వర్క్ ఆగిపోవడం పై ఫిర్యాదు చేశారు. ఎక్కువగా జియో నెట్‌వర్క్ చాలా గంటల పాటు పనిచేయలేదని ట్వీట్ చేశారు. మరికొంత మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో జియో నెట్‌వర్క్ కూడా డౌన్ అయ్యిందని పోస్ట్ చేశారు. రిలయన్స్ జియో @jiocare అధికారిక కస్టమర్ కేర్ హ్యాండిల్ వినియోగదారుల ఫిర్యాదులతో నిండిపోయింది. మరోవైపు, వినియోగదారుల ఫిర్యాదుకు సమాధానమిస్తూ జియో కస్టమర్ ఆఫీసర్ విచారం వ్యక్తం చేశారు అలాగే కొన్ని గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ రోజు ఉదయం 9.30 గంటలకు
జియో నెట్‌వర్క్ ఈ రోజు ఉదయం 9.30 గంటలకు నిలిచిపోయింది. అయితే జియో నెట్‌వర్క్ డౌన్ అయ్యిందనే ఫిర్యాదు ఈరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మొదటగా నమోదైంది. దీని తరువాత, జియో నెట్‌వర్క్ డౌన్ అవుతున్నట్లు ఫిర్యాదు చేసే వారి సంఖ్య వేగంగా పెరిగింది. జియో నెట్‌వర్క్‌లో ఈ అంతరాయం కారణంగా, #జియోడౌన్ ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్ ప్రారంభమైంది.
సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ ఫిర్యాదులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్ నుండి ఎక్కువగా వచ్చాయి. మంగళవారం రాత్రి నుండి నెట్‌వర్క్ అంతరాయం కలిగిందని చెబుతున్నారు. వినియోగదారులు ఫోన్ కాల్‌లు చేయలేకపోవడం లేదా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయలేకపోవడం వంటి సమస్యల పై సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.
అగ్రిగేటర్ సర్వర్‌లలో సమస్యల కారణంగా
జియో సోర్సెస్ ప్రకారం అగ్రిగేటర్ సర్వర్‌లో సమస్య కారణంగా మొబైల్ నెట్‌వర్క్, ఇంటర్నెట్ సేవలలో సమస్యలు ఎదురయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు కంపెనీ ఈ సమస్యను 90 శాతం వరకు పరిష్కరించింది. చాలా వరకు సర్కిళ్లలో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.
జూలై నాటికి జియో 44.32 మిలియన్ కస్టమర్లు
ట్రాయ్ డేటా ప్రకారం జూలైలో 65.1 లక్షల కొత్త కస్టమర్లు చేర్చడంతో కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 44.32 కోట్లకు పెరిగింది. వోడా, బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ గురించి మాట్లాడితే ఈ కంపెనీలు జూలైలో సబ్‌స్క్రైబర్ బేస్ పరంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.