ఫోటోగ్రఫీ కెమెరాతో గూగుల్ సరికొత్త స్మార్ట్ ఫోన్.. దీని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఇవే..

First Published | Oct 6, 2021, 1:49 PM IST

ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్సెల్ 6 సిరీస్ దాదాపు రెండు నెలల నిరీక్షణ తర్వాత మార్కెట్లోకి ఎంట్రీ ఎచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా ప్రకటించింది. సమాచారం ప్రకారం గూగుల్ అక్టోబర్ 19న గూగుల్ పిక్సెల్ -6, పిక్సెల్ -6 ప్రోలను లాంచ్ చేయనుంది.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటికి వచ్చింది. ఈ ఫోన్ ద్వారా కంపెనీ మెరుగైన కెమెరా క్వాలిటీతో మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాని కంపెనీ అందించింది, అయితే గూగుల్ AL/ML సెన్సార్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫోటోగ్రఫీతో పాటు ఈ ఫోన్‌లో  ట్రాన్స్లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Latest Videos


గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో  మార్కెట్ ధరల గురించి ఇంకా వెల్లడించలేదు, కానీ యుఎస్‌లో దీనికి మంచి స్పందన లభిస్తోంది. అక్టోబర్ 19న లాంచ్ అయిన వెంటనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

గూగుల్ పిక్సెల్ 6లో కంపెనీ 6.4-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ AMOLED డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో అందించబోతోంది. పిక్సెల్ -6 ప్రోలో  6.7-అంగుళాల QHD ప్లస్ AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తాయి. కలర్స్ గురించి మాట్లాడితే  పిక్సెల్ 6 ఆరెంజ్, గ్రీన్, టీల్ కలర్‌లో రావచ్చు. పిక్సెల్ -6 ప్రో మార్కెట్లో వైట్, గోల్డ్ కలర్ షేడ్స్‌లో లాంచ్ చేయవచ్చు.

click me!