వాట్సాప్‌లో పొరపాటున కూడా ఈ 6 పనులు చేయకండి.. లేదంటే మీ అకౌంట్..?

First Published Oct 5, 2021, 6:13 PM IST

ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ను ఉపయోగించేవారు.  ఫేస్‌బుక్‌ ద్వారా దేశ, విదేశాలలోని  ప్రజలతో చాటింగ్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా మంది చాటింగ్ కోసం వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ అనేది ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ దీని ద్వారా వాయిస్, వీడియో కాల్స్ కూడా చేయవచ్చు. 

వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి అలాగే ప్రజలు దీనిని అత్యాధికంగా ఉపయోగిస్తున్నారు, కానీ ఈ యాప్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ప్రజలు నివారించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మీరు పొరపాటున కూడా అలా చేస్తే, మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ వాట్సాప్ అకౌంట్ కూడా బ్యాన్ కావొచ్చు. వాట్సాప్‌ని మీకు అందిస్తున్న సదుపాయాలను మీరు సద్వినియోగం చేసుకుకోవచ్చు కానీ తప్పుడు  ప్రయోజనాల కోసం కాదు. వాట్సాప్‌లో మీరు చేయకూడని పనులు ఎంటో తెలుసుకోండి..

 వాట్సాప్‌ ద్వారా ఎవరికీ అభ్యంతరకరమైన లేదా బెదిరింపు మెసేజెస్ పంపవద్దు అలా చేస్తే  మీపై చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా అలా మీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, మీరు  తీవ్రమైన పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏదైనా చట్టవిరుద్ధమైన సినిమా పైరేటెడ్ లింక్‌ని షేర్ చేస్తే మీపై చర్యలు తీసుకోవచ్చు. 

వాట్సాప్‌లో ఇతరులను రెచ్చగొట్టే మెసేజులు ఎవరికీ ఫార్ వర్డ్ చేయవద్దు లేదా  వ్రాయవద్దు, ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఇబ్బంది ఏర్పడవచ్చు, ఇక మీపై చర్యలు తీసుకోవచ్చు. వాట్సాప్‌లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను వేధించడం చేయవద్దు.

వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు లేదా థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్  చేయవద్దు, ఎందుకంటే అవి మీ డేటాను హ్యాక్ చేయగలవు. ఒకవేళ ఇతరులు మీ వాట్సాప్ అకౌంట్ ని బ్లాక్ చేసినట్లయితే మీ వాట్సాప్  ఖాతాను అనుమానాస్పదంగా పరిగణించి నిషేదిస్తుందని  తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

click me!