వివాదంలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌.. మనుషుల్ని కోతుల్లా రికమండ్‌ చేయడంతో నెటిజన్స్‌ విమర్శలు..

First Published | Sep 4, 2021, 12:47 PM IST

సోషల్ మీడియా నెట్‌వర్క్‌లోని వీడియోలో "ప్రైమేట్స్" కోసం బ్లాక్ మెన్‌ను తప్పుగా భావించిన తర్వాత ఫేస్‌బుక్  టాపిక్ రికమండేషన్ ఫీచర్‌ని నిలిపివేసినట్లు శుక్రవారం తెలిపింది. ఫేస్‌బుక్ ప్రతినిధి దీనిని స్పష్టంగా ఆమోదయోగ్యం కాని లోపం అని అన్నారు. రికమెండేషన్ సాఫ్ట్‌వేర్ ఆఫ్‌లైన్‌ చేసినట్లు చెప్పారు.

"ఈ అభ్యంతరకర రికమెండేషన్ చూసిన వారిని మేము క్షమాపణలు కోరుతున్నాము" అని ఏ‌ఎఫ్‌పి విచారణకు ప్రతిస్పందనగా ఫేస్‌బుక్ తెలిపింది.

" మేము దీనిని గ్రహించిన వెంటనే మొత్తం టాపిక్ రికమెండేషన్ ఫీచర్‌ని డిసేబుల్ చేసాము, దీనికి కారణాన్ని పరిశోధించి మళ్లీ జరగకుండా నిరోధిస్తాము."

ఫేస్ రికాగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్ పై సివిల్ రైట్స్ న్యాయవాదులు సమస్యలను ఎత్తి చూపడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నయి.  

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఇటీవల రోజుల్లో బ్లాక్ మెన్ ఉన్న బ్రిటిష్ టాబ్లాయిడ్ వీడియోను చూసిన ఫేస్‌బుక్ యూజర్లకు ఆటోమేటిక్ జనరేట్ ప్రాంప్ట్‌  "ప్రైమేట్స్ గురించి మరిన్ని వీడియోలను చూడాలని కోరుకుంటున్నారా " అని చూపిస్తూ  యూజర్లను కోరింది ఫేస్‌బుక్‌. దీంతో ఇది ముమ్మాటికి జాత్యంహాకార వ్యవహారమేనంటూ ఫేస్‌బుక్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు. 

Latest Videos


ప్రైమేట్ ఫ్యామిలీలోని అనేక జాతులలో మానవులు ఉన్నప్పటికీ వీడియోకు కోతులు, చింపాంజీలు లేదా గొరిల్లాలతో ఎలాంటి సంబంధం లేదు. అయితే ప్రైమేట్స్‌లో కోతులు, చింపాంజీలు, గొరిల్లాతో పాటు మనుషులు కూడా ఉంటారని, బహుశా ఆ ఉద్దేశంతో అలా రికమండేషన్‌ వచ్చి ఉంటుందని కొందరు టెక్నికల్‌ నిపుణులు చెప్తున్నారు. 

రికమెండేషన్  స్క్రీన్ క్యాప్చర్ ని ట్విట్టర్‌లో మాజీ ఫేస్‌బుక్ కంటెంట్ డిజైన్ మేనేజర్ డార్సీ గ్రోవ్స్ షేర్ చేశారు.

click me!