తెలుగు రాష్ట్రాల్లో జియోకు కొత్త చందాదారులు.. 3.16 కోట్ల కస్టమర్లతో మళ్ళీ నెంబర్ 1 స్థానంలో

First Published | May 13, 2021, 6:21 PM IST

హైదరాబాద్, 13 మే 2021: ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం సబ్ స్క్రైబర్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియో గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను జత చేసింది. 
 

దీంతో ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో జియో తన మార్కెట్ నాయకత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఫిబ్రవరి నాటికి 3.16 కోట్లకు పైగా మొబైల్ చందాదారులతో పాటు దాదాపు 40% కస్టమర్ మార్కెట్ వాటాతో జియో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతోంది.
ట్రాయ్ ప్రచురించిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి లో జియో అత్యధికంగా 1,48,278 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. తరువాతి స్థానంలో ఎయిర్ టెల్ 72,559 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. మరోవైపు వోడాఫోన్ ఐడియా 1,90,341 మంది సభ్యులను, బీఎస్ఎన్ఎల్ 7880 మంది కస్టమర్లను కోల్పోయాయి.

దేశవ్యాప్తంగా జియో అత్యధికంగా 42.66 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చింది. ఎయిర్టెల్ 37.3 లక్షలు జోడించగా, వోడాఫోన్ ఐడియా 6.5 లక్షల మంది సభ్యులను చేర్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ 3.6 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2021లో దేశంలో మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య 82,92,668 కు పెరిగింది.
4జి డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్డేటా డౌన్‌లోడ్ స్పీడ్ లోను రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్ లోడ్ స్పీడ్ లో టాప్ లో ఉంది. జియో తన సమీప పోటీదారి వోడాఫోన్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ డౌన్‌లోడ్ స్పీడ్ కలిగి ఉంది.
మే 11న అప్‌డేట్ చేసిన ట్రాయ్ డేటా ప్రకారం వోడాఫోన్ ఏప్రిల్‌లో 7 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగాన్ని నమోదు చేసింది. ఐడియా 5.8 ఎమ్‌బిపిఎస్, ఎయిర్ టెల్ 5 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఉన్నాయి.నెట్‌వర్క్ అప్‌లోడ్ విభాగంలో 6.7 ఎమ్‌బిపిఎస్‌ వేగంతో వోడాఫోన్ అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత ఐడియా 6.1 ఎమ్‌బిపిఎస్, జియో 4.2 ఎమ్‌బిపిఎస్, ఎయిర్ టెల్ 3.9 ఎమ్‌బిపిఎస్ వేగాన్ని నమోదు చేసాయి.

Latest Videos

click me!