పిల్లల ఆన్ లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి

First Published | May 13, 2021, 11:59 AM IST

స్వయం సంవృద్ది ఇండియా క్యాంపైన్ లో భాగంగా లావా కొత్త స్మార్ట్‌ఫోన్ లావా జెడ్ 2 మాక్స్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. లావా జెడ్ 2 మాక్స్  ని పిల్లల ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు.  లావా జెడ్ 2 మాక్స్ స్మార్ట్‌ఫోన్ గురించి చెప్పాలంటే దీని ఫీచర్స్ టాబ్లెట్ లాంటివి. 7 అంగుళాల పెద్ద డిస్ ప్లే తో భారీ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ అందించారు.  

లావా జెడ్ 2 ధరలావా జెడ్ 2 మాక్స్ ధర రూ.7,799. ప్రస్తుతం దీనిని లావా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దాని గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
లావా జెడ్ 2 మాక్స్ ఫీచర్స్లావా నుండి వస్తున్న ఈ కొత్త ఫోన్ కి 7 అంగుళాల హెచ్‌డి ప్లస్ నాచ్ డిస్‌ప్లేతో 1600×900 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, మీడియాటెక్ హిలియో ప్రాసెసర్ అందించారు. ఫోన్‌లో 2 జీబీ డీడీఆర్ 4 ఎక్స్ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

లావా జెడ్ 2 మాక్స్ కెమెరాకెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
లావా జెడ్ 2 మాక్స్ బ్యాటరీఈ లావా ఫోన్‌లో ఇన్‌బిల్ట్ బాక్స్ స్పీకర్ ఇచ్చారు. అంతేకాకుండా 6000mAh భారీ బ్యాటరీ, డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఉంటుంది. ఛార్జింగ్ కోసం యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి.

Latest Videos

click me!