రెడ్‌మికి పోటీగా ఇండియన్ బ్రాండ్ బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1 ఇయర్‌బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

First Published | May 11, 2021, 12:30 PM IST

 దేశీయ కంపెనీ బౌల్ట్  కొత్త ఇయర్ బడ్స్ బౌల్ట్ ఎయిర్ బేస్ ఎఫ్ఎక్స్ 1ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1ను బ్లాక్, బ్లూ, వైట్ అనే మూడు రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీనిలో పాసివ్ నాయిస్ ఇసోలేషన్ ఉంది.

అంతేకాకుండా వాటర్ రెసిస్టెంట్ కోసం IPX5గా రేట్ పొందింది. బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1 ధర రూ.1,499. ఇది రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్, స్నోకర్ ఐరాకర్ స్టిక్స్ వంటి ఇయర్‌బడ్‌లతో పోటీపడుతుంది. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఇచ్చారు. ఫీచర్స్ గురించి మాట్లాడితే బౌల్ట్ ఎయిర్‌బాస్ ఎఫ్‌ఎక్స్ 1 లో పాసివ్ నాయిస్ ఐసోలేషన్, బ్యాటరీ 8 గంటల బ్యాకప్, ఛార్జింగ్ కేసుతో 24 గంటల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ కోసం డిఫాల్ట్ వాయిస్ అసిస్టెంట్‌ కూడా ఉంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5 లభిస్తుంది.
ఈ ఏడాది మార్చిలో బౌల్ట్ కొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో బౌల్ట్ ఆడియో ఎయిర్‌బేస్ జెడ్ 1ను కూడా భారతదేశంలో విడుదల చేయడం గమనార్హం. ఈ బడ్స్ సిలికాన్ ఇయర్ టిప్ తో అందుబాటులో లేనప్పటికీ, స్టెమ్ డిజైన్ ఎయిర్‌బేస్ జెడ్ 1తో లభిస్తుంది. బౌల్ట్ ఆడియో ఎయిర్‌బేస్ జెడ్ 1ను మూడు రంగులు, స్టైలిష్ లుక్‌లో కొనుగోలు చేయవచ్చు.

దీనిలో లో ల్యాటెన్సి మోడ్‌ కూడా ఉంది. వాటర్ ప్రూఫ్ కోసం IPX5గా రేట్ చేయబడింది. రెండు బడ్స్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, టచ్ కంట్రోల్ కలిగి ఉన్నాయి. ఎయిర్‌బేస్ జెడ్ 1 ధర రూ.1,599 దీనిని నలుపు, నీలం, తెలుపు ఫినిషింగ్ తో కొనుగోలు చేయవచ్చు.
బౌల్ట్ ఆడియో ఎయిర్‌బేస్ జెడ్ 1లో 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్, అడిషనల్ పవర్ ఫుల్ బేస్ ఉంది. ఇది 10 మీటర్ల పరిధి వరకు బ్లూటూత్ v5.0 కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇయర్‌బడ్స్‌లో గేమింగ్ కోసం లో ల్యాటెన్సి మోడ్ ఉంది. సింగీల్ ఫుల్ చార్జ్ బ్యాటరీపై 8 గంటల బ్యాకప్‌ ఇస్తుంది.

Latest Videos

click me!