రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద కొత్త ఫాస్ట్‌అండ్‌ఫ్యూచరిస్టిక్ స్మార్ట్‌ఫోన్‌.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్ ఇవే..

First Published | Jul 9, 2021, 8:22 PM IST

షియోమి ఇండియా  మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 10టి 5జిని రెడ్‌మి నోట్ 10 సిరీస్ కింద త్వరలో భారత్‌లో విడుదల చేయబోతోంది. కానీ లాంచ్ డేట్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.    రెడ్‌మి నోట్ 10టి 5జి మైక్రోసైట్ కూడా అమెజాన్ ఇండియాలో ప్రత్యక్షమైంది. 

షియోమి ఒక ట్వీట్ ద్వారా ఫోన్ లాంచ్ గురించి సమాచారం ఇచ్చింది. షియోమి ట్వీట్‌లో 'మీ ఇష్టమైన కప్ కాఫీతో హాయిగా కూర్చోని రిలాక్స్ కావడానికి సమయం ఆసన్నమైంది, మేము మా మొట్టమొదటి #ఫాస్ట్‌అండ్‌ఫ్యూచరిస్టిక్ స్మార్ట్‌ఫోన్‌తో వస్తున్నాము!' అని తెలిపింది.
ఈ ఫోన్ కి సంబంధించి 'నోటిఫై మి' బటన్ కూడా అమెజాన్‌లో ప్రత్యక్షమైంది. ట్వీట్‌తో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేసింది. దీనిలో ఫోన్ ముందు, వెనుక ప్యానెల్ కనిపిస్తుంది. షేర్ చేసిన ఫోటో ప్రకారం ఫోన్ దీర్ఘచతురస్రాకార శైలిలో కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ముందు భాగంలో పంచ్‌హోల్ డిస్ ప్లే ఇచ్చారు.

రెడ్‌మి నోట్10టి 5జి స్పెసిఫికేషన్లుఈ ఫోన్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, గ్రాఫిక్స్ కోసం మాలి-జి 57 జిపియు ఇచ్చారు.
కెమెరా ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డీప్ సెన్సార్, ఫోన్‌కు సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. నైట్ మోడ్, ఏ‌ఐ కెమెరా, మూవీ ఫ్రేమ్, స్లో మోషన్ వీడియో, మాక్రో మోడ్ కాకుండా ఏ‌ఐ బ్యూటీ మోడ్ కూడా కెమెరాతో లభిస్తుంది.
బ్యాటరీఈ ఫోన్‌లో ఏ‌ఐ ఫేస్ అన్‌లాక్‌తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం దీనికి డ్యూయల్ సిమ్, 5జి, 4జి, ఎన్‌ఎఫ్‌సి, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి5.1, జిపిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.

Latest Videos

click me!