భారతీయ భాషలతో రియల్‌మీ డిజో ఫీచర్ ఫోన్‌.. అతితక్కువ ధరకే బేసిక్ ఫీచర్లతో లాంచ్..

First Published | Jul 6, 2021, 4:44 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ సబ్‌ బ్రాండ్‌ డిజో తొలి ఫీచర్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. డిజో ఏకకాలంలో రెండు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేయటం విశేషం. వీటిలో డిజో స్టార్ 500, డిజో స్టార్ 300 ఉన్నాయి. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లకు టి9 కీప్యాడ్, టార్చ్ అండ్ అన్ని భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. 

డిజో ఈ రెండు ఫోన్‌లలో 2జి సపోర్ట్ ఇచ్చింది, కాబట్టి జియో ఫోన్‌తో పోటీపడవు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 4జి ఫీచర్ ఫోన్‌ల మార్కెట్ పెరుగుతున్నప్పటికీ డిజో 2జి ఫీచర్ ఫోన్‌లను మాత్రమే ప్రవేశపెట్టింది. డిజో స్టార్ 500, డిజో స్టార్ 300 ఫోన్‌లలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందించారు. వీటిలో డిజో స్టార్ 500 ధర రూ.1,799, డిజో స్టార్ 300 ధర రూ.1,299. ఫస్ట్ సేల్ తేదీ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు, అయితే ఈ రెండు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా త్వరలో విక్రయించనున్నారు.
రియల్‌మీ డిజో స్టార్ 500, డిజో స్టార్ 300 ఫీచర్లుడిజో స్టార్ 500 2.8-అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది. అయితే డిస్ ప్లేకి టచ్ సపోర్ట్ లేదు. డిజో స్టార్ 300 1.77-అంగుళాల కలర్ డిస్‌ప్లేతో వస్తుంది, దీనికి కూడా టచ్‌ సపోర్ట్ లేదు. ఈ రెండు ఫోన్‌లలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌తో పాటు వీజీఏ (0.3 మెగాపిక్సెల్) కెమెరా ఉంది. ఫోన్‌లో 32 ఎమ్‌బి ర్యామ్‌తో 32 ఎమ్‌బి స్టోరేజ్ ఇచ్చారు. అయితే మీరు మెమరీ కార్డ్ సహాయంతో 64 జిబి వరకు స్టోరేజ్‌ పెంచుకొవచ్చు.

డిజో స్టార్ 500 హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ, తెలుగుతో సహా పలు భారతీయ భాషలకు సపోరేట్ చేస్తుంది. మరోవైపు పంజాబీ, బెంగాలీ భాషలను అదనంగా డిజో స్టార్ 300లో ఇచ్చారు. ఎఫ్‌ఎం రేడియోతో పాటు రెండు ఫోన్‌లకు బ్లూటూత్, వాయిస్ రికార్డర్, ఫైల్ మేనేజర్, అలారం, మ్యూజిక్ ప్లేయర్‌కు సపోర్ట్ ఉంది.
ఈ ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రో యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. డిజో స్టార్ 500 1900 ఎంఏహెచ్ బ్యాటరీతో, డిజో స్టార్ 300 2550 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Latest Videos

click me!