పెద్ద స్క్రీన్, 5జి సపోర్ట్ తో క్వాల్‌కామ్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్లు ఇవే..

First Published | Jul 9, 2021, 12:19 PM IST

 చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త క్వాల్‌కామ్  స్మార్ట్‌ఫోన్‌కు "స్మార్ట్‌ఫోన్ ఫర్ స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్" అని పేరు పెట్టింది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ని ఆసుస్‌ భాగస్వామ్యంతో తయారు చేశారు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన కంపెనీ లాయల్టీ ప్రోగ్రామ్   కోసం ఈ ఫోన్ ని ప్రత్యేకంగా రూపొందించారు. 

ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ కాకుండా, 144Hz రిఫ్రెష్ రేట్‌తో ఆమోలెడ్ డిస్ ప్లే కూడా అందించారు. అంతేకాకుండా ఫోన్‌లో 512 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఫోన్‌తో ఇయర్‌బడ్స్ ఉచితంగా లభిస్తాయి.
స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్ స్మార్ట్‌ఫోన్‌ ధర స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్ స్మార్ట్‌ఫోన్ ధర 1,499 డాలర్లు అంటే సుమారు రూ.1,12,200. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో సింగిల్ మోడల్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ని ఆగస్టు నుండి మిడ్ నైట్ బ్లూ కలర్‌లో ఆసుస్ ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. మొదట చైనా, జపాన్, కొరియా, యుఎస్, యుకె, ఇండియా దేశాలలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు, అయితే ఇండియాలో దీని ధర గురించి ఎటువంటి సమాచారం లేదు.

స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్ స్పెసిఫికేషన్లుథర్డ్ జనరేషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్60 5జి మోడెమ్ ఈ సపోర్ట్ ఫోన్‌లో ఉపయోగించారు. దీనికి క్వాల్‌కామ్ సిగ్నల్ బూస్ట్ కనెక్టివిటీకి సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ సౌండ్ 24 బిట్, 96 కిలోహెర్ట్జ్. దీనితో పాటు క్వాల్‌కామ్ స్పెక్ట్రా 580 ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ తో 4కె, 8కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్స్ గురించి మాట్లాడితే 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ డిస్ ప్లే, 1080x2448 పిక్సెల్స్ రిజల్యూషన్, డిస్ ప్లే బ్రైట్ నెస్ 1,200 నిట్స్. డిస్ ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్, హెచ్‌డి‌ఆర్10, హెచ్‌డి‌ఆర్ 10 ప్లస్ లకు కూడా సపోర్ట్ ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 16 జీబీ ఎల్‌పిడిడిఆర్ 5 ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్ కెమెరా కెమెరా గురించి మాట్లాడితే దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఇచ్చారు. దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 సెన్సార్ తో ఎపర్చరు f1.8, రెండవ లెన్స్ 12-మెగాపిక్సెల్ సోనీ IMX363 అల్ట్రా-వైడ్ సెన్సార్ తో ఎపర్చరు f2.2.మూడవ లెన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సెల్ఫీ కోసం 24 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
స్నాప్‌డ్రాగన్ ఇన్‌సైడర్స్ బ్యాటరీస్మార్ట్ ఏ‌ఎం‌పి అండ్ స్నాప్‌డ్రాగన్ సౌండ్‌కు సపోర్ట్ తో ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. క్వాడ్ హెచ్‌డిఆర్ మైక్రోఫోన్ కూడా ఫోన్‌తో సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ వి5.2, ఎన్‌ఎఫ్‌సి, జిపిఎస్ ఎ-జిపిఎస్ నావిక్ అండ్ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 5.0తో వస్తుంది. ఫోన్ బరువు 210 గ్రాములు.

Latest Videos

click me!