హాట్ హాట్ గా పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్.. రికార్డులు బ్రేక్ చేసిన అమ్మకాలు..

First Published | Feb 10, 2021, 7:24 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో  ఫిబ్రవరి 9న పోకో ఎం3  స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సెల్ ప్రారంభించింది. విశేషం ఏంటంటే పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ మొదటి  సేల్ సందర్భంగా 1,50,000 యూనిట్లను విక్రయించింది. ఈ విషయాన్ని పోకో సంస్థ స్వయంగా ధృవీకరించింది. పోకో ఎం3 తదుపరి సేల్ ఫిబ్రవరి 16న జరగబోతోంది, దీని కోసం 30 లక్షలకు పైగా ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు. పెద్ద డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పెద్ద 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం3 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. తక్కువ ధరతో మంచి కెమెరా, ఎక్కువ ర్యామ్ ఇంకా స్టోరేజ్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టారు.

పోకో ఎం3 ధరభారతదేశంలో పోకో ఎం3 ప్రారంభ ధర రూ. 10.999. ఈ ధర వద్ద, 6 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ లభించగా, అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో పేమెంట్ చేస్తే లేదా ఫోన్‌ను ఇఎంఐలో కొనుగోలు చేస్తే మీకు రెండు మోడళ్లపై రూ .1000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పోకో ఎం3 కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
పోకో ఎం3 స్పెసిఫికేషన్లుఈ ఫోన్‌కు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయూఐ 12 లభిస్తుంది. ఇది కాకుండా 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ ఇంకా 64128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.

పోకో ఎం3 కెమెరాకెమెరా గురించి చెప్పాలంటే ఈ పోకో ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రధాన లెన్స్ కెమెరా 48 మెగాపిక్సెల్స్ దాని ఎపర్చరు ఎఫ్ 1.79. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా దీని ఎపర్చరుతో ఎఫ్ 2.4, మూడవ లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ దీని ఎపర్చరు f2.4. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
పోకో ఎం3 బ్యాటరీఈ పోకో ఫోన్ లో కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ బరువు 198 గ్రాములు. ఫోన్‌లో స్టీరియో స్పీకర్ అందించారు.

Latest Videos

click me!