ఇక ఓ‌టి‌టి ప్లాట్‌ఫామ్‌లో అలాంటి కంటెంట్‌కి చెక్.. త్వరలోనే అమలులోకి కొత్త నియమాలు..

First Published Feb 9, 2021, 6:39 PM IST

ఓ‌టి‌టి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతున్న కంటెంట్‌కు సంబంధించి తరచూ ఫిర్యాదులు, సలహాల దృష్ట్యా వీటికోసం కొత్త మార్గదర్శకాలు తయారు చేయబడ్డాయి. ఇవి త్వరలోనే అమలులోకి రానున్నాయి అని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ జీరో అవర్ సందర్భంగా రాజ్యసభలో ఈ సమాచారం ఇచ్చారు. ఓ‌టి‌టి  అంటే ఓవర్ ద టాప్ మీడియా సర్వీస్ అని అర్ధం.
 

ఓ‌టి‌టి ప్లాట్‌ఫామ్‌లో కనిపించే కంటెంట్ గురించి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, దాని నియంత్రణ గురించి సూచనలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు. ఇది ఒక ముఖ్యమైన అంశంగా అభివర్ణించిన ఆయన ఈ విషయంలో మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారని, త్వరలో అమలు చేయానున్నట్లు చెప్పారు.
undefined
అంతకుముందు, బిజెపి రాజ్య సభ సభ్యులు ఒకరు ఈ అంశాన్ని లేవనెత్తారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇంటర్నెట్ చాలా ఉపయోగకరమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా మారింది. అలాగే ఇది వినోదం కోసం ఒటిటి ప్లాట్‌ఫాం ప్రజల ఆకర్షన పెంచింది. అయితే అందులో చూపించే కంటెంట్ భాష అభ్యంతరకరంగా ఉంది దీనిని నియంత్రించాలి" అని అన్నారు.
undefined
ఓ‌టి‌టిలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ గురించి చాలా ఫిర్యాదులు వచ్చాయని ప్రకాష్ జవదేకర్ ఇంతకు ముందు కూడా చెప్పారు. ఓ‌టి‌టిలో ప్రసారం అవుతున్న సినిమాలు, కార్యక్రమాలు, డిజిటల్ న్యూస్ అనేవి ప్రెస్ కౌన్సిల్, కేబుల్ టెలివిజన్, సెన్సార్ బోర్డు చట్టానికి వర్తించవు. ఇవి సజావుగా కొనసాగేందుకు ఏర్పాట్లు త్వరలో ప్రకటించబడతాయి.
undefined
సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, టిగ్మాన్షు ధులియా నటించిన వెబ్ సిరీస్ 'తాండవ' గురించి గతంలోనే చాలా వివాదాలు జరిగాయి. ఈ కేసు ఎంతగానో పెద్దగా అయ్యింది, ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకోవలసి వచ్చింది. అన్ని ఫిర్యాదులను తెలుసుకున్న తరువాత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దీనిపై అమెజాన్ ప్రైమ్ నుండి సమాధానం కోరింది. 'తాండవ' వెబ్ సిరీస్‌లో హిందూ దేవతలు, దేవుళ్ళను ఎగతాళి చేశారని ఫిర్యాదులలో ఆరోపించారు.
undefined
undefined
click me!