రియల్‌మీ P4 ప్రో 5G vs మోటరోలా ఎడ్జ్ 60: అద్బుత‌మైన‌ డిజైన్, ఫీచర్స్, ధర.. మీకు సరైన ఫోన్ ఏది?

Published : Aug 16, 2025, 09:24 AM IST

Realme P4 Pro 5G vs Motorola Edge 60: రియల్‌మీ P4 ప్రో 5G ఆగస్టు 20న భారత్‌లో లాంచ్ కానుంది. మోటరోలా ఎడ్జ్ 60తో పోల్చితే డిజైన్, స్పెక్స్, ధరలు ఎలా ఉన్నాయి? మీకు ఏ ఫోన్ బెస్ట్ అప్ష‌న్ అవుతుంది? ఆ వివరాలు మీకోసం.

PREV
16
రియల్‌మీ P4 సీరీస్

రియల్‌మీ P4 ప్రో 5G భారత్‌లో ఆగస్టు 20న అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. రియల్‌మీ అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్‌ ద్వారా కూడా అప్‌డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్‌లో రియల్‌మీ P4, P4 ప్రో 5G మోడల్స్ లభ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఈ-స్టోర్, రిటైల్ పార్ట్నర్స్ వద్ద కొనుగోలు చేయవచ్చు.

26
డిజైన్ & డిస్‌ప్లే

రియల్ మీ పీ4 ప్రో 5జీ (Realme P4 Pro 5G): 6.77 ఇంచుల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, గరిష్టంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్, సన్నని బేజెల్స్, పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది.

మోట‌రోలా ఎడ్జ్ 60 ((Motorola Edge 60) : ఇది 6.67 ఇంచుల pOLED కర్వ్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ను న‌క‌లిగి ఉంది. కర్వ్డ్ స్క్రీన్, థిన్ బాడీ వలన ఈ ఫోన్ హ్యాండ్‌లో కంఫర్ట్‌గా పట్టుకోవచ్చు.

36
ప్రాసెసర్ & పనితీరు

రియల్ మీ పీ4 ప్రో 5జీ (Realme P4 Pro 5G): Snapdragon 7 Gen 4 చిప్‌సెట్, పిక్సెల్‌వర్క్స్ ప్రాసెసర్, 7,000 చదరపు మిల్లీమీటర్ల AirFlow VC కూలింగ్ సిస్టమ్. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా డిజైన్ చేశారు.

మోట‌రోలా ఎడ్జ్ 60 ((Motorola Edge 60) : Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 5G సపోర్ట్. బ్యాటరీ ఎఫిషియెన్సీ, స్మూత్ గేమింగ్ అనుభవం అందిస్తుంది.

46
కెమెరా ఫీచర్స్

రియల్ మీ పీ4 ప్రో 5జీ (Realme P4 Pro 5G): డ్యూయల్ రియర్ కెమెరా, 50MP Sony IMX896 ప్రైమరీ సెన్సార్ (OIS సపోర్ట్), 50MP ఫ్రంట్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ @ 60fps, AI Travel Snap & AI Landscape ఫీచర్స్.

మోట‌రోలా ఎడ్జ్ 60 ((Motorola Edge 60) : ట్రిపుల్ రియర్ కెమెరా, 50MP ప్రైమరీ (OIS), 13MP అల్ట్రా-వైడ్, 2MP డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32MP.

56
బ్యాటరీ & ఛార్జింగ్

రియల్ మీ పీ4 ప్రో 5జీ (Realme P4 Pro 5G): 7,000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్.

మోట‌రోలా ఎడ్జ్ 60 ((Motorola Edge 60) : దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

66
ధరలు ఎలా ఉన్నాయి?

రియల్ మీ పీ4 ప్రో 5జీ (Realme P4 Pro 5G): ధర రూ. 30,000 లోపుగా ఉండే అవకాశం.

Motorola Edge 60 ధర రూ. 25,999 గా ఉంది.

రియల్‌మీ P4 ప్రో 5G vs మోటరోలా ఎడ్జ్ 60:

ఈ పోలిక ప్రకారం రియల్‌మీ P4 ప్రో 5G (Realme P4 Pro 5G) పెద్ద బ్యాటరీ, అధునాతన డిస్‌ప్లే, కొత్త Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో వస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 తక్కువ ధరలో కర్వ్డ్ డిస్‌ప్లే, మంచి కెమెరా సెటప్, ప్రీమియం లుక్‌తో అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories