పదిహేను వేల రూపాయల బడ్జెట్లో మీరు ఫోన్ కొనాలనుకుంటున్నారా? భారతదేశంలో అత్యుత్తమ మొబైల్ ఫోన్ జాబితా ఇక్కడ ఇచ్చాము. మధ్యతరగతి వారికి ఇవి అందుబాటులో ఉంటాయి. ఉత్తమ కెమెరాలు, వేగమైన ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీలతో అందించడంలో ఇవి ముందుంటాయి.
మధ్యతరగతి వారు ఎక్కువగా కొనేది 15 వేల రూపాయల లోపు ఉన్న మొబైల్ ఫోన్లే. అందులో కూడా మంచి కెమెరా, టెక్నాలజీ ఉన్న ఫోన్ల కోసమే ఎక్కువ మంది వెతుకుతూ ఉంటారు. ఈ ధరలో మన దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇక్కడ ఇచ్చాము. 15,000 రూపాయల లోపు ఉత్తమ ఫోన్ల జాబితా ఇది. వీటిలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోండి. వాటి ఫీచర్లను బట్టి మీకు ఏ ఫోన్ ఉపయోగకరమో దాన్ని కొనుక్కోవడం ఉత్తమం.
25
Iqoo Z10x ఫోన్ ఫీచర్లు
ఇది మీ బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్. పాలికార్బోనోట్ ఫ్రేమ్, వెనుక ప్యానెల్ ను అందిస్తుంది. దీని ప్రాసెసర్ వేగంగా పనిచేస్తుంది. దీనికున్న కెమెరా అతిపెద్ద ప్లస్ అని చెప్పుకోవాలి. ఛార్జింగ్ కూడా త్వరగా అవుతుంది. స్టాండ్ బై సమయం కూడా ఎక్కువ రోజులే ఉంటుంది. రెండు రోజులు పాటు బ్యాటరీ నడుస్తుంది. 6.72 అంగుళాలు స్క్రీన్ ఉంటుంది. ఫోను 6 జిబి ర్యామ్ తో, 128 జీబీ నిల్వ సామర్థ్యంతో వస్తుంది. వెనుక కెమెరా 50 MP ఉంటే ముందు కెమెరా 8MP సామర్థ్యంతో పనిచేస్తుంది. దీని ఖరీదు అమెజాన్ లో 13,498 రూపాయలు కాగా, ఫ్లిప్ కార్ట్ లో 13,690 రూపాయలుగా ఉంది.
35
Oppo k13 5g
ఒప్పో కంపెనీకి చెందిన ఈ ఫోను 4జిబి ర్యామ్ తో వస్తుంది. ఇక స్టోరేజీ 128gb ఉంటుంది. వెనుక కెమెరా 50mp కాగా, ముందు కెమెరా 8 మెగాపిక్సెల్ సామర్థ్యంతో వస్తుంది. ఫ్లిప్ కార్ట్ లో దీని ఖరీదు 11,999 రూపాయలు కాగా అమెజాన్ లో ధర 12,030 రూపాయలుగా ఉంది.
45
పోకో N7 Pro 5g
పోకో కంపెనీకి చెందిన ఫోన్లు 6.67 అంగుళాల పొడవుతో వస్తాయి. దీనికి 6gb ర్యామ్, 128gb స్టోరేజీ ఉంటుంది. వెనుక కెమెరా 50mp ఉంటే, ముందు కెమెరా ఏకంగా 20 mp ఉంటుంది. దీని ఖరీదు అమెజాన్ లో 12,899 రూపాయలు కాగా, ఫ్లిప్ కార్ట్ లో 12,999 రూపాయలుగా ఉంది.
55
ఇంకా ఎన్నో ఫోన్లు
పైన చెప్పినవే కాదు Vivo Y195G కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్. దీని ఖరీదు అమెజాన్ లో 11,499 రూపాయలుగా ఉంది. ఇక Redmi 14c5G ఫోన్ కూడా మంచి ఫీచర్లతో వచ్చింది. దీని ఖరీదు కూడా 11,499 రూపాయలు ఉంటుంది. సామ్ సంగ్ గెలాక్సీ M15 5G ఫోన్ ధర ఫ్లిప్ కార్ట్ లో 13,500 రూపాయలుగా ఉంది. ఇది కూడా మంచి మన్నిక గల ఫోన్.